బ్యాంకు ఖాతాదారులు చనిపోతే ఆ మనీ ఎలా తీస్తారో తెలుసా

ఒకప్పటిలా కాకుండా ఇప్పుడు ప్రతీ పని డిజిటల్‌గానే చేసేందుకు జనాలు ఇష్టపడుతుండటం మనం గమనించొచ్చు.ఇందుకు‌గాను ప్రతీ ఒక్కరికి కావాల్సింది బ్యాంక్ అకౌంట్ అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

 Do Bank Customers Know How To Withdraw That Money If They Die, Banc Account, Inf-TeluguStop.com

అసలు బ్యాంక్ అకౌంటే లేకపోతే డిజిటల్ ట్రాంజాక్షన్స్ ఎలా చేస్తాం? చెప్పండి.అయితే, బ్యాంక్ అకౌంట్‌లో ఉన్న మనీ దురదృష్టవశాత్తు అకౌంట్ హోల్డర్ చనిపోతే ఎలా ఇస్తారో? మీకు తెలుసా? అందుకు గల ఫార్మాలిటీస్ ఏంటి? ఎవరిని మనీ కోసం సంప్రదించాలి? ఆ మనీ ఎవరికి ఇస్తారు? అనే విషయాలను ఈ స్టోరీ చదివి మీరూ తెలుసుకోండి.

బ్యాంక్ అకౌంట్ హోల్డర్ మరణించిన వెంటనే కుటుంబీకులు వ్యక్తికి బ్యాంక్ అకౌంట్ ఉన్న బ్రాంచ్‌కు వెళ్లి ఆ విషయాన్ని తెలియపర్చాల్సి ఉంటుంది.అది మ్యాండేటరీ.అలా తెలియపరిస్తేనే బ్యాంక్ మేనేజర్ కొన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసి మరణించిన వ్యక్తి నామినీకి లేదా కుటుంబీకులకు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఫాలో అయి డబ్బులు చెల్లిస్తాడు.ఒక వేళ ఏమవుతుంది లే? అని అకౌంట్ హోల్డర్ చనిపోయిన విషయాన్ని తెలపకుండా హోల్డ్‌లో ఉంటే.కొద్ది రోజుల పాటు ఆ తర్వాత కాలంలో తిరిగాల్సి ఉంటుంది.బ్యాంక్ మేనేజర్స్ కొందరు ఫ్రాడ్ చేసే అవకాశాలుంటాయి.

Telugu Bank, Bankcustomers-Latest News - Telugu

ఇందుకు సంబంధించిన బోలెడు కేస్ స్టడీస్ అవెయిలబుల్‌గా ఉన్నాయి.ఓ వ్యక్తి మరణించిన సంగతి బ్యాంక్ మేనేజర్‌కు తెలిసింది.అయితే, సదరు వ్యక్తి నామినీ లేదా కుటుంబీకులు ఆ సంగతి ఇన్‌ఫామ్ చేయకుండా అలానే ఉండిపోయారు.దాంతో బ్యాంక్ మేనేజర్ మరణించిన వ్యక్తి అకౌంట్ నుంచి డబ్బులు వేరే అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాడు.

ఆ తర్వాత అతడు కొద్ది రోజులకే ఆ బ్యాంక్ బ్రాంచ్ నుంచి ట్రాన్స్‌ఫర్ అయ్యాడు.కొన్ని ఏళ్ల తర్వాత చనిపోయిన వ్యక్తి కూతురు తన తండ్రి అకౌంట్ క్లోజ్ చేసి ఉన్న మనీ ఇవ్వాలని కోరగా, అసలు విషయం బయటపడింది.

అయితే, ఈ కేసు సాల్వ్ చేయడానికి బ్యాంక్ అధికారులకు ఏడాది పట్టిందట.ఈ నేపథ్యంలోనే అకౌంట్ హోల్డర్ మరణించిన వెంటనే బ్యాంకు మేనేజర్ లేదా అధికారులకు ఆ సంగతి తెలియపరచం ముఖ్యమని గుర్తించాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube