ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీలన్నీ ప్రచారాన్ని హోరెత్తిస్తున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే వైసీపీ తమ మ్యానిఫెస్టోను( Manifesto ) విడుదల చేయగా.
తాజాగా కూటమి ‘ఉమ్మడి మ్యానిఫెస్టో -2024 ’ ను రిలీజ్ చేసింది.ఈ మేరకు టీడీపీ అధినేత చంద్రబాబు, ( Chandrababu ) జనసేనాని పవన్ కల్యాణ్ తో( Pawan Kalyan ) పాటు బీజేపీ నేత సిద్ధార్థ్ నాథ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
అయితే ఇది కేవలం టీడీపీ -జనసేన మ్యానిఫెస్టో( TDP Janasena Manifesto ) మాత్రమేనని .ఎన్డీఏ కూటమి మ్యానిఫెస్టో కాదంటూ పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఉమ్మడి మ్యానిఫెస్టోను రిలీజ్ చేసిన తరువాత మ్యానిఫెస్టోను పట్టుకోవడానికి బీజేపీ నేత సిద్ధార్థ నాథ్( Siddarth Nath ) నిరాకరించారు.దీంతో ఉమ్మడి మ్యానిఫెస్టోకు బీజేపీ( BJP ) మద్ధతు ఇస్తుందా.? లేదా.? అన్న దానిపై ప్రతి ఒక్కరిలో ప్రశ్నలు తలెత్తుతున్నాయి.అంతేకాదు ఇది ఎన్డీఏ కూటమి మ్యానిఫెస్టో( NDA Alliance Manifesto ) కాదని చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనమని పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది.పేరుకే బీజేపీ పొత్తులో ఉందా.? టీడీపీ – జనసేన మ్యానిఫెస్టోపై వ్యతిరేకత కనబరుస్తుందా? అనేది ప్రశ్నార్థకంగా మారిందని తెలుస్తోంది.

అయితే త్వరలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఏపీలో టీడీపీ – బీజేపీ – జనసేన కూటమిగా ఏర్పడి బరిలోకి దిగుతున్నాయన్న సంగతి తెలిసిందే.ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన పార్టీ అధిష్టానాలు.గెలుపు కోసం పక్కా ప్రణాళికలతో వ్యూహారచనలు చేస్తూ ముందుకెళ్తున్నాయి.
ఈ క్రమంలోనే తాజాగా ఉమ్మడి మ్యానిఫెస్టోను ప్రకటించాయి.కాగా ఈ మ్యానిఫెస్టోలో బీజేపీ పొందుపరిచిన అంశాలు ఉన్నాయో.
లేదో తెలియాల్సి ఉంది.

యువగళం( Yuvagalam ) ద్వారా టీడీపీకి వచ్చిన వినతులతో పాటు జనవాణి( Janavani ) ద్వారా వచ్చిన వినతులన్నింటినీ దృష్టిలో పెట్టుకుని మ్యానిఫెస్టోను రూపొందించినట్లు పార్టీ అధినేతలు పేర్కొన్న సంగతి తెలిసిందే.2047 నాటికి దేశాన్ని సూపర్ పవర్ గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని తెలిపారు.ఈ క్రమంలోనే టీడీపీ సూపర్ సిక్స్ తో పాటు జనసేన షణ్ముఖ వ్యూహాం మరియు అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమాన్ని అందించే పలు కీలక అంశాలను మ్యానిఫెస్టోలో పొందుపరిచామని పేర్కొన్నారు.
కానీ ఇందులోనూ బీజేపీకి సంబంధించిన ఎలాంటి హామీలు లేవనే టాక్ వినిపిస్తోంది.ఈ ఉమ్మడి మ్యానిఫెస్టో కేవలం టీడీపీ, జనసేనది మాత్రమేనని పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.
ఈ క్రమంలోనే చంద్రబాబు, పవన్ అలవికాని హామీలకు తాము బాధ్యత తీసుకోమని బీజేపీ తప్పించుకుందని తెలుస్తోంది.అంతేకాదు మ్యానిఫెస్టోలో మోదీ, బీజేపీ ఫోటోలు కూడా లేవు.ఆఖరు రాష్ట్ర బీజేపీ నేతల ఫోటోలు కూడా లేకుండా మ్యానిఫెస్టో ఉండటం గమనార్హం.మూడు పార్టీల ఉమ్మడి మ్యానిఫెస్టో అని చెబుతున్నప్పటికీ బీజేపీ దూరంగా ఉందని తెలుస్తోంది.
అందుకే చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఫొటోలతో మ్యానిఫెస్టోను విడుదల చేశారని తెలుస్తోంది.