ప్రాణం తీసే వ‌డ‌దెబ్బ‌.. ల‌క్ష‌ణాలు ఎలా ఉంటాయో తెలుసా?

వేస‌వి కాలం వ‌చ్చేసింది.మార్చి నెల‌లోనే ఊపందుకున్న ఎండ‌లు.

 What Are The Symptoms Of Heat Stroke! Symptoms Of Heat Stroke, Heat Stroke, Heat-TeluguStop.com

ఏప్రిల్ వ‌చ్చే స‌రికి మ‌రింత మంట పుట్టిస్తున్నాయి.రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతల తీవ్రత మరింత పెరగబోతోంది.

అయితే వేస‌వి కాలంలో తీవ్రంగా స‌త‌మ‌తం చేసే ప్ర‌మాద‌క‌ర‌మైన స‌మ‌స్య‌ల్లో వ‌డ‌దెబ్బ ముందు వ‌ర‌స‌లో ఉంటుంది.దీనిని నిర్ల‌క్ష్యం చేస్తే ప్రాణాలే రిస్క్ లో ప‌డ‌తాయి.

అందుకే వ‌డ‌దెబ్బ‌ను ముందే గుర్తించి స‌రైన స‌మ‌యానికి చికిత్స తీసుకోవాల‌ని నిపుణులు చెబుతుంటారు.అస‌లు ఇంత‌కీ వ‌డ‌దెబ్బను ఎలా గుర్తించాలి.? దాన్ని ల‌క్ష‌ణాలు ఎలా ఉంటాయి వంటి విష‌యాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

శరీర ఉష్ణో గ్రతను నియంత్రించే వ్యవస్థ బలహీన‌ప‌డిపోయి ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడటాన్నే వడదెబ్బ అంటారు.

దీని బారిన ప‌డిన‌ప్పుడు మైకం, త‌ల తిర‌గ‌డం, తీవ్ర‌మైన త‌ల‌నొప్పి, విప‌రీతంగా చెమ‌ట‌లు ప‌ట్ట‌డం, అధిక దాహం వంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి.అలాగే ఏకాగ్ర‌త లోపించ‌డం, కండరాల నొప్పి, కండరాల తిమ్మిర్లు, క‌డుపులో తిప్పుతున్న అనుభూతి, వాంతులు, విరోచనాలు, వికారం, హార్ట్ రేట్ పెర‌గ‌డం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, మాన‌సిక గంద‌ర‌గోళం వంటివి కూడా వ‌డ దెబ్బ ల‌క్ష‌ణాలే.

Telugu Tips, Stroke, Stroke Symptoms, Latest, Symptoms Stroke-Latest News - Telu

ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే ఏ మాత్రం ఆల‌స్యం చేయ‌కుండా స‌రైన చికిత్స తీసుకోవాలి.లేదంటే పరిస్థితి విషమించి కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉంటుంది.వ‌య‌సు పైబడిన వృద్ధులు, చిన్నారులు, గర్భిణీలు, బాలింతలు, దీర్ఘకాలిక వ్యాధుల‌తో ఇబ్బంది ప‌డుతున్న వారిపై వ‌డదెబ్బ ప్ర‌భావం ఎక్కువ‌గా ఉంటుంది.అందుకే వీరు మ‌రింత అప్ర‌మ‌త్తంగా ఉండాలి.

అలాగే ఎండ‌ల్లో ప‌ని చేసే వారు కూడా వ‌డ‌దెబ్బ బారిన ప‌డ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి.ముఖ్యంగా వాట‌ర్‌ను రోజుకు కనీసం నాలుగు లీట‌ర్ల వ‌ర‌కు సేవించాలి.

ఎండలో బయటకు వెళ్లేటప్పుడు తలకు క్యాప్‍ ధ‌రించాలి.స‌మ‌యానికి ఫుడ్ తీసుకోవాలి.

ఆల్కహాల్, సిగరెట్, కూల్ డ్రింక్స్ వంటి వాటికి దూరంగా ఉండాలి.డైట్‌లో కీర‌, పుచ్చ‌కాయ‌, దానిమ్మ‌, ఖ‌ర్జూరం, పుదీనా, ఆరెంజ్‌, క‌ర్బూజ‌, మ‌జ్జ‌గ వంటివి ఉండేలా చూసుకోవాలి.

వదులైన కాటన్ దుస్తులనే వేసుకోవాలి.మ‌సాలా వంట‌ల‌ను, నూనెలో వేయించిన ఆహారాల‌ను తీసుకోవ‌డం త‌గ్గించాలి.

త‌ద్వారా వ‌డ‌దెబ్బ నుంచి ర‌క్ష‌ణ పొందొచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube