రాత్రి సమయంలో ఇడ్లీ, దోశ తింటున్నారా..? అయితే జాగ్రత్త..!

ఈ మధ్యకాలంలో జీవిస్తున్న విధానం ప్రకారం కొన్ని అనారోగ్య సమస్యల కారణంగా చాలామంది రాత్రి సమయంలో అన్నం తినడం మానేసి చపాతీ, ఇడ్లీ, దోశలు తింటున్నారు.అయితే రాత్రి సమయంలో వీటిని తినడం మంచిదేనా? లేదా అని కొంతమందిలో అనుమానం ఉంటుంది.అయితే వీటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.అయితే ఇడ్లీ, దోశలు అంటే పులియపెట్టిన ఫుడ్స్.ఇవి జీర్ణశక్తికి( Digestion ) మంచివే, కానీ వీటిని రాత్రి తీసుకోవడం మంచిదేనా లేదా అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

 Is It Good To Eat Idli And Dosa At Night,idli,dosa,,dinner Food,telugu Health,fe-TeluguStop.com

ఇడ్లీ, దోశలు మంచి బాక్టీరియా ఉత్పత్తిని పెంచుతాయి.వీటివలన ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది.

వీటిలో ఎక్కువగా పీచు పదార్థాలు ఉంటాయి.

Telugu Dosa, Tips, Idli, Telugu-Telugu Health

అయితే ఉదయాన్నే వీటిని తీసుకోవడం మంచిది.కానీ రాత్రి తీసుకోవడం మాత్రం మంచిది కాదు.సాధారణంగా గర్భిణీలు, పాలిచ్చేవారు కూడా రాత్రుల్లో పులియపెట్టిన ఆహారాన్ని( Fermented Food ) తీసుకోకూడదు.

ఇలా తీసుకోవడం వలన గర్భధారణ సమయంలో కడుపు అసౌకర్యంగా ఉంటుంది.ఇక పెరుగు, పనీర్ లాంటి వాటికి కూడా దూరంగా ఉండాలి.

అంతేకాకుండా పాలిచ్చే తల్లులు కూడా వీటికి దూరంగా ఉండడం మంచిది.ఎందుకంటే తల్లికి కడుపునొప్పి వస్తే పిల్లలు కూడా వస్తుంది.

కాబట్టి రాత్రి సమయంలో ఇలాంటి వాటిని తీసుకోకూడదు.ఇక సాధారణంగా పులియపెట్టిన ఆహారాల్లో ఉప్పు ఎక్కువగా ఉంటుంది.

Telugu Dosa, Tips, Idli, Telugu-Telugu Health

అలాంటప్పుడు రక్తపోటు( Blood Pressure ) ఉన్నవారు కూడా వీటిని రాత్రి సమయంలో తీసుకోకపోవడమే మంచిది.రాత్రి సమయంలో వీటిని తీసుకోవడం వలన ఆ రక్తపోటు పెరిగే అవకాశం ఉంది.కాబట్టి వీటిని తీసుకోకపోవడం మంచిది.రాత్రి సమయంలో పులియపెట్టిన ఇడ్లీ, దోష లాంటివి అసలు తీసుకోకూడదు.ఇలాంటివి తీసుకుంటే అజీర్ణం, తలనొప్పి లాంటి సమస్యలతో కూడా బాధపడతారు.ఇక రాత్రి సమయంలో ఇలాంటి పులియపెట్టిన వంటకాలను తీసుకోవడం వలన జీర్ణ సమస్యలు, ఎసిడిటీ( Acidity ), కడుపుబ్బరం లాంటి సమస్యలు ఎదురవుతాయి.

అలాగే జీర్ణ సమస్యలు ఉన్నవారు రాత్రి సమయంలో దోష, ఇడ్లీలు తీసుకోకపోవడం మంచిది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube