ప్రతి ఒక్కరి జివితంలో ప్రేమ, పెళ్లి, పిల్లలు అనేది ఒక మధురైమైన అనుభూతిగా మిగిలిపోతాయి.ముఖ్యంగా మొదటిసారి ఒక పండంటి బిడ్డకు జన్మనిచ్చేటప్పుడు అయితే ఆ దంపతులు సంతోషానికి అవధులుండవు అది సెలెబ్రిటీస్ అయినా సామాన్యులైన.అయితే మనం ఇప్పుడు ఈ 2020 లో మొదటిసారి గర్భం దాల్చిన సెలబ్రిటీలు ఎవరెరున్నారో చూద్దాం.
అనుష్క శర్మ :
ఈ వరుసలో అందరికంటే ముందున్నారు.అనుష్క శర్మ, విరాట్ కోహ్లీలు.వీళ్ళు 2017 డిసెంబర్ లో ప్రేమించి పెళ్లిచేసుకున్నారు.ఇప్పుడు అనుష్క శర్మ ప్రెగ్నెంట్ గా వుంది ఈ విషయాన్నీ కోహ్లీని సోషల్ మీడియాలో తమ మొదటి సంతానం కోసం ఎంతో ఎగ్జైంటింగ్ గా ఎదురుచూస్తున్నామంటూ వీళ్లిద్దరు కలిసున్నా ఫోటోని షేర్ చేసాడు.
కరీనా కపూర్ :
ఇక బాలీవుడ్ హాట్ హీరోయిన్ కరీనా కపూర్.అందరికి తెలిసిందే.ఈమె సైఫ్ అలీఖాన్ ని ప్రేమించి పెళ్లిచేసుకుంది.
ఇప్పటికే వీళ్లిద్దరికీ తైమూర్ అలీ ఖాన్ అనే కొడుకు వున్నాడు.ఈ కరీనా కొడుకు తైమూర్ బాలీవుడ్ లో ఎంత ఫేమస్ అంటే 3 సంవత్సరాల వయసులోనే సోషల్ మీడియాని దున్నేస్తున్నాడు.
ఇక ఇప్పుడు కరీనా తన రెండో సంతానం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తుంది.ఆమె ఇటీవలే గర్భం దాల్చింది.దానికి సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూనే ఉంది.
సాగరిక గాడ్జే :
ఇండియన్ ఫాస్ట్ బౌలర్ క్రికెటర్ జహీర్ ఖాన్ గురించి అందరికి తెలిసిందే.ఈయన బాలీవుడ్ యాక్టర్ సాగరిక గాడ్జే అనే అమ్మాయిని 2017 లో ప్రేమించి పెళ్లిచేసుకున్నాడు.అయితే ఇపుడు సాగరిక ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది.త్వరలో వీళ్లు ఓ పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారు.
నటాషా :
ఇక ఇండియాన్ క్రికెట్ టీం లో యాంగ్రీ యంగ్ మ్యాన్ హెగా గుర్తింపు తెచ్చుకున్న హార్దిక్ పాండ్యా గురించి అందరికి తెలిసిందే.ఇతను నటి నటాషా ను ప్రేమించి పెళ్లిచేసుకున్నాడు.అంతేకాదు వీళ్లిద్దరికీ ఈ 2020 జులై లో ఒక అబ్బాయి కూడా పుట్టాడు.ఆ సంతోషాన్ని హార్దిక్ పాండ్య తన అభిమానులతో పంచుకున్నారు.
అమృతా రావు :
మహేష్ బాబు అతిధి సినిమాలో హీరోయిన్ అమృతా రావు మీ అందరికి గుర్తుండే ఉంటుంది.ఆమె కూడా ఈ 2020 లోనే ఒక బిడ్డకు జన్మనిచ్చింది.ఈమె 2016 లో రేడియో జాకీ అన్మోల్ ను ప్రేమించి పెళ్లిచేసుకుంది.
ఇప్పుడు హ్యాపీగా తన ఫ్యామిలీని చూసుకుంటూ గడిపేస్తుంది.అనితా :
ఇక మన తెలుగు సినిమా చరిత్రలో సూపర్ డూపర్ హిట్ గా నిలిచినా ‘నువ్వు నేను’ సినిమా అందరికి గుర్తుండే ఉంటుంది ఆ సినిమాలో హీరోయిన్ గా నటించిన అనితా కూడా త్వరలో ఓ బిడ్డకు జన్మినివ్వబోతుంది.ఆమెకు సంబంధించిన బేబి బంబ్ ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.ఈమె రోహిత్ రెడ్డి అనే బిజినెస్ మ్యాన్ ని 2013 లో పెళ్లిచేసుకుంది.
రూనీ మారా :
ఇక విజేత వాకిన్ ఫీనిక్స్ మరియు రూనీ మారా దంపతులు ఇప్పుడు ఎంతో సంతోషంగా వున్నారు.వాళ్ళ ఇంట్లోకి త్వరలో ఓ బుజ్జి అతిథి రాబోతున్నట్టు సంతోషంగా ప్రకటించారు.
రోజ్ లెస్లీ :
ఇక హాలీవుడ్ లో సూపర్ హీరో అండ్ హీరోయిన్ అయినా కిట్ హారింగ్టన్ మరియు రోజ్ లెస్లీ దంపతులు కూడా మొదటి బిడ్డకు జన్మనివ్వబోతున్నట్టు ప్రకటించారు.