కెనడాలో భారతీయ యువకుడి దారుణహత్య.. పోలీసుల అదుపులో అనుమానితుడు

భారతీయుడిని దారుణంగా హత్య చేసిన కేసులో ఓ యువకుడిని కెనడా పోలీసులు అరెస్ట్ చేశారు.ఏప్రిల్ 23న బ్రిటీష్ కొలంబియా ప్రావిన్స్‌లోని వాంకోవర్ శివారులో 26 ఏళ్ల భారత జాతీయుడు కుల్విందర్ సింగ్ సోహి( Kulwinder Singh Sohi ) హత్యకు గురయ్యారు.

 Canadian Police Arrest Man In Connection With Killing Of Indian National , Vanco-TeluguStop.com

అతనిపై కత్తిపోట్లకు పాల్పడినట్లుగా అనుమానిస్తున్న 28 ఏళ్ల వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు ఇంటిగ్రేటెడ్ హోమిసైడ్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (హెచ్ఐటీ) సోమవారం ప్రకటించింది.అయితే అదుపులోకి తీసుకున్న వ్యక్తి గుర్తింపును మాత్రం వారు వెల్లడించలేదు.

ఇంటిగ్రేటెడ్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ సాయంతో అతనిని అరెస్ట్ చేసినట్లుగా అధికారులు తెలిపారు.

Telugu Canadian, Canadianindian, Indian National, Kulwindersingh, Vancouver, Whi

ఈ హత్య వైట్ రాక్ పట్టణంలో చోటు చేసుకుంది.ఓ వ్యక్తి గాయపడినట్లుగా సమాచారం అందుకున్న రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్ అనుబంధ వైట్ రాక్ డిటాచ్‌మెంట్( White Rock Detachment ) అధికారులు , బ్రిటీష్ కొలంబియా ఎమర్జెన్సీ హెల్త్ సర్వీసెస్‌తో పాటుగా ఘటనాస్థలికి చేరుకున్నారు.నిందితుడు 5 అడుగుల 11 అంగుళాల ఎత్తున్న నల్లజాతి పురుషుడిగా.

అతను ముదురు రంగు టోపీ, బూడిద రంగు హూడీ ధరించి వున్నట్లుగా ప్రత్యక్ష సాక్షులు పోలీసులకు తెలిపారు.నిందితుడు, బాధితుడి మధ్య భౌతిక ఘర్షణ జరిగిందని వారు వెల్లడించారు.

Telugu Canadian, Canadianindian, Indian National, Kulwindersingh, Vancouver, Whi

మరోవైపు.సోహిపై( Sohi ) దాడి జరగడానికి రెండ్రోజుల ముందు కూడా ఇదే ప్రాంతంలో మరో భారత సంతతికి చెందిన వ్యక్తి కత్తిపోట్లకు గురైనట్లుగా స్థానిక మీడియా పేర్కొంది.ఏప్రిల్ 21న వైట్‌రాక్ పీర్ సమీపంలో ఓ వ్యక్తి కత్తిపోట్లకు గురైనట్లుగా పోలీసులకు సమాచారం అందింది.బాధితుడిని 28 ఏళ్ల జతీందర్ సింగ్‌గా గుర్తించారు.పారామెడిక్స్ ప్రథమ చికిత్స అందించడంతో ప్రాణాపాయం తప్పింది .ఈ రెండు ఘటనలు స్థానికంగా సంచలనం సృష్టించాయి.వైట్‌రాక్ ఆర్‌సీఎంపీ సైతం ఈ ప్రాంతంలో పెట్రోలింగ్‌ను పెంచింది.సోహి కుటుంబం అతని భౌతికకాయాన్ని భారతదేశానికి తీసుకురావడానికి ఆన్‌లైన్‌లో ఫండ్ రైజింగ్ కార్యక్రమాన్ని చేపట్టింది.ఆదివారం వైట్‌రాక్ పీర్ వద్ద సోహి సంస్మరణ సభ జరిగింది.ఈ కార్యక్రమానికి స్థానికులు, భారతీయ కమ్యూనిటీ పెద్ద సంఖ్యలో హాజరైంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube