నా భర్తను అన్నా అని పిలిచేదానిని.. వైరల్ అవుతున్న బర్రెలక్క షాకింగ్ కామెంట్స్!

రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు బర్రెలక్క అలియాస్ శిరీష( Barrelakka alias Sirisha ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.మొన్నటి వరకు ఈమె పేరు సోషల్ మీడియాతో పాటు రెండు తెలుగు రాష్ట్రాలలో మారుమోగిన విషయం తెలిసిందే.

 Barrelakka Alias Karne Sirisha Told Interesting Things About Husband Love Marria-TeluguStop.com

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసి ఓటమి పాలవ్వడంతో ఆమె సోషల్ మీడియాకు అలాగే అటు మీడియా దూరమైంది.సోషల్ మీడియా ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఈమె అతి తక్కువ సమయంలోనే భారీగా పాపులారిటీని సంపాదించుకుంది.

Telugu Barrelakka, Barrelakkaalias, Karne Sirisha, Love, Tollywood-Movie

ఇక ఎన్నికల సమయంలో అయితే ప్రతి ఒక్కరూ ఆమెకి మద్దతుగా నిలిచారు.కానీ ఎవరు ఊహించని విధంగా ఆమె ఎన్నికల్లో పోటీ చేసి మరీ ఓటమిపాలైంది.ఇకపోతే శిరీష ఇటీవల పెళ్లి చేసుకుని మూడుముళ్ల బంధంతో వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే.తమ బంధువుల అబ్బాయి వెంకటేష్‌ను పెళ్లి చేసుకుంది.పెద్దల సమక్షంలో గతనెల 28న వీరి పెళ్లి ఘనంగా జరిగింది.అయితే తాను పెళ్లి చేసుకున్న వెంకటేష్ గురించి బర్రెలక్క ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

ఒక యూట్యూబ్‌ ఛానెల్‌కు( YouTube channel ) ఇచ్చిన ఇంటర్వ్యూలో బర్రెలక్క మాట్లాడుతూ.

Telugu Barrelakka, Barrelakkaalias, Karne Sirisha, Love, Tollywood-Movie

మెుదట్లో వెంకటేష్ అంటే అస్సలు నచ్చకపోతుండేది.మాకు ఇంటర్ నుంచే పరిచయం ఉంది.ఇద్దరూ కలిసి నాగర్‌ కర్నూల్‌( Nagar Kurnool ) లోని ఒక ప్రైవేటు కాలేజీలో చదువుకున్నాము.

నాకు వెకంటేష్ బంధువు అన్న విషయం అక్కడే తెలిసిందని వెల్లడించారు.కాలేజీ రోజుల్లోనే తాను జీన్స్ వంటివి వేసుకుని స్టైలిష్‌గా ఉండేదానన్ని.అది చూసిన వెంకటేష్ అలాంటి వద్దని హెచ్చరించేవాడు అని ర్రెలక్క తెలిపింది.గాజులు, పూలు, బొట్టు పెట్టుకోవాలని సూచించేవాడని దాంతో అతడంటే తనకు ఇష్టం ఉండేది కాదని చెప్పింది.

ఆ తర్వాత తనకు ఐ లవ్‌ యూ అని మెసేజ్‌లు పెట్టి డిలీట్ చేసేవాడని అది చూసి అతనిపై ఇంకా కోపం పెరిగిందని తెలిపింది.ఆ తర్వాత క్రమంలో తనకు ఎదురైన కష్టాల్లో వెంకటేష్ తోడుగా ఉన్నాడని ఈ క్రమంలోనే తమ తల్లిదండ్రులు పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చారు.

మా ఇద్దరికి ఒకరిపై ఒకరికి మంచి అభిప్రాయం ఉండటంతో వివాహా బంధంలోకి అడుగుపెట్టినట్లు బర్రెలక్క వెల్లడించారు.తమకు పరిచయమైన కొత్తలో వెంకటేష్‌ను అన్నా అని పిలిచేదాన్నని ఇప్పుడు పెళ్లి కావటంతో అలా పిలవటం లేదని చెప్పుకొచ్చింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube