ఇటీవల రోజుల్లో స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా ఎందరో మంది హెయిర్ ఫాల్ సమస్యతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.హెయిర్ ఫాల్ సమస్య వల్ల మానసిక కృంగుబాటుకు గురవుతూ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్న వారూ ఎందరో ఉన్నారు.
అయితే హెయిర్ ఫాల్ సమస్యకు అనేక కారణాలు ఉన్నట్టే.నివారణ మార్గాలు బోలెడన్ని ఉన్నాయి.
ముఖ్యంగా ఇప్పుడు చెప్ప బోయే హెయిర్ మాస్క్‌ను వారంలో ఒకే ఒక్క సారి వేసుకున్నారంటే జుట్టు ఊడమన్నా ఉడదు.
మరి ఆలస్యం ఎందుకు ఆ హెయిర్ మాస్క్ ఏంటీ.? దాన్ని ఎలా తయారు చేసుకోవాలి.? వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.ఈ హెయర్ మాస్క్‌కి చామంతి టీ అవసరం.కాబట్టి, ముందుగానే చామంతి టీని తయారు చేసుకుని చల్లార బెట్టుకోవాలి.ఇప్పుడు ఒక గిన్న తీసుకుని అందులో ఐదు టేబుల్ స్పూన్లు చామంతి టీ, ఒక టేబుల్ స్సూన్ అల్లం రసం, ఒక గుడ్డు పచ్చసొన, ఒక టేబుల్ స్పూన్ తేనె, రెండు టేబుల్ స్పూన్ల అలోవెర జెల్ వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకుంటే హెయిర్ మాస్క్ సిద్ధమైనట్టే.

ఇప్పుడు ఈ మాస్క్‌ను హెయిర్‌కి ఎలా వేసుకోవాలీ అంటే.ముందుగా జుట్టుకు రెగ్యులర్ ఆయిల్‌ను అప్లై చేసుకోవాలి.ఆ తర్వాత తయారు చేసుకుని మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు అప్లై చేసుకుని షవర్ క్యాప్ పెట్టేసుకోవాలి.
గంట అనంతరం మైల్డ్ షాంపూను యూజ్ చేసి గోరు వెచ్చని నీటితో తల స్నానం చేయాలి.
ఈ హెయిర్ మాస్క్‌ను వారంలో ఒక్క సారి వేసుకుని హెయిర్ ఫాల్ సమస్య క్రమంగా తగ్గు ముఖం పడుతుంది.
అదే సమయంలో జుట్టు ఒత్తుగా, నల్లగా మరియు పొడవుగా పెరుగుతుంది.