మీ పిల్లలను మంచిగా పెంచాలనుకుంటున్నారా.. అయితే సైకాలజిస్ట్ లు ఏమి చెబుతున్నారో తెలుసుకోండి..!

చిన్న పిల్లలు( Children ) ప్రతి రోజు ఎక్కువగా అల్లరి చేస్తున్నారు.వారిని అలా చూడలేకపోతున్నాము అని చాలామంది తల్లిదండ్రులు చెబుతూ ఉంటారు.

 How To Raise Children Well What Psychologists Are Saying Details, Raise Childre-TeluguStop.com

మా పిల్లాడు మొబైల్ ఫోన్ లేకుండా అన్నం కూడా తినడు అని చాలా మంది తల్లిదండ్రులు చెబుతూ ఉంటారు.మనుషులతో అస్సలు మాట్లాడడం లేదని కూడా కొంతమంది చెబుతున్నారు.

మనం డిజిటల్ ప్రపంచంలో ఉన్నాం అనేది కొట్టి పారేయలేని నిజం అని కచ్చితంగా చెప్పవచ్చు.వాటి నుంచి పిల్లల దృష్టిని మళ్ళించడానికి తల్లిదండ్రులు( Parents ) పడే తంటాలు అన్నీ ఇన్ని కావు.

కొందరు వాటిని నమ్మి ఆచరించి ఫలితాలు కనిపించక బాధపడుతూ ఉన్నారు.

మరి అలాంటి పిల్లలను పెంచాలంటే కఠిన శిక్షలు అవసరం లేదని ఖరీదైన కార్పొరేట్ స్కూల్లో అవసరం అంతకన్నా లేదని సైకాలజిస్ట్ లు( Psychologists ) చెబుతున్నారు.

మరి పిల్లలను ఎలా పెంచాలో ఇప్పుడు తెలుసుకుందాం.అన్నిటికీ మించి మీ పిల్లలతో క్రమం తప్పకుండా సమయాన్ని వేచిస్తూ ఉండాలి.వారి ప్రతిస్పందనను చురుకుగా వింటూ ఉండాలి.దీనీ ద్వారా మరొక వ్యక్తి పట్ల ఎలా శ్రద్ధ చూపాలో వారికి చెబుతూ ఉండాలి.

ఇంకా చెప్పాలంటే గట్టిగా మాట్లాడితే పిల్లలు నొచ్చుకుంటారని చాలామంది తల్లిదండ్రులు ముఖ్యమైన విషయాలను కూడా నెమ్మదిగా సున్నితంగా చెబుతూ ఉంటారు.దీంతో పిల్లలు వాటిని ఏమాత్రం పట్టించుకోరు.

Telugu Care Tips, Psychology, Tips, Raise-Telugu Health

కాబట్టి ముఖ్యమైన విషయాలను కాస్త గట్టిగా చెప్పాలని పరిశోధకులు చెబుతున్నారు.పిల్లలు ఒక నిర్ణయం( Decision ) తీసుకోవడం ద్వారా ఎవరెవరు ప్రభావితం అవుతారో వారినీ ఎందుకు పరిగణలోకి తీసుకోవాలో మీ పిల్లలకు అర్థమయ్యేలా వివరించాలి.ఇంకా చెప్పాలంటే పిల్లలలో సహాయం చేసే గుణం,( Helping Nature ) కృతజ్ఞత తెలిపే అలవాట్లను నేర్పించాలి.ముఖ్యంగా చెప్పాలంటే పిల్లల్లో కూడా కోపం, అవమానం, అసూయ లాంటి నెగటివ్ ఎమోషన్స్ ఎక్కువగా ఉంటాయి.

తల్లిదండ్రులు,కుటుంబ సభ్యులు, స్నేహితులు ఇలా పిల్లల సర్కిల్ చాలా చిన్నది.సర్కిల్లోని వ్యక్తుల పట్ల వారు ప్రేమ, శ్రద్ధ, అనుభూతి చూపిస్తున్నారో లేదో తెలుసుకుంటూ ఉండాలి.

Telugu Care Tips, Psychology, Tips, Raise-Telugu Health

అయితే ఆ సర్కిల్ లోపల ఉన్న వ్యక్తుల గురించి కూడా వారు శ్రద్ధ వహించేలా చేయడం ఎంతో అవసరం.ఇతరులు చెప్పేది శ్రద్ధగా వినాలని వారి సమస్యలను,తమ కోణంలో అర్థం చేసుకోవాలని పిల్లలకు చెబుతూ ఉండాలి.ఈ సూత్రాల్లు పాటిస్తే ఒక శ్రద్ధగల గౌరవప్రదమైన నైతికత గల పిల్లలను పెంచడం సాధ్యమేనని నిపుణులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube