ముఖ చర్మం ఎంత తెల్లగా, మృదువుగా ఉన్నా కూడా అక్కడక్కడ కనిపించే ముదురు రంగు మచ్చలు అందాన్ని మొత్తం పాడుచేస్తాయి.మనలోని ఆత్మ ధైర్యాన్ని దెబ్బతీస్తాయి.
చాలా మందికి ఈ మచ్చలను ఎలా వదిలించుకోవాలో తెలియక మేకప్ తో కవర్ చేస్తుంటారు.మరికొందరు మార్కెట్లో లభ్యమయ్యే క్రీమ్ సీరం లను కొనుగోలు చేసి వాడుతుంటారు.
వాటి వల్ల ఎటువంటి ప్రయోజనం లేకుంటే ఏం చేయాలో తోచక తెగ సతమతం అయిపోతుంటారు.కానీ మచ్చలతో చింతించకండి.
మీకు ఇప్పుడు చెప్పబోయే మిరాకిల్ రెమెడీ అద్భుతంగా సహాయపడుతుంది.
ఈ రెమెడీని పాటిస్తే వారం రోజుల్లో మచ్చలకు బై బై చెప్పచ్చు.
క్లియర్ స్కిన్ ను తమ సొంతం చేసుకోవచ్చు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ మిరాకిల్ రెమెడీ ఏంటో ఓ చూపు చూసేయండి.
ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో అరకప్పు తరిగి పెట్టుకున్న బొప్పాయి పండు( Papaya fruit ) ముక్కలు వేసుకుని స్మూత్ పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్లు ఓట్స్ పౌడర్ వేసుకోవాలి.

అలాగే రెండు టేబుల్ స్పూన్లు బొప్పాయి పండు ప్యూరీ, వన్ టేబుల్ స్పూన్ అలోవెరా జెల్( Aloe vera gel ), పావు టేబుల్ స్పూన్ వైల్డ్ టర్మరిక్ పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ రోజ్ వాటర్( Rose water ) వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి మెడకు అప్లై చేసుకుని ఇరవై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై వాటర్ తో చర్మాన్ని శుభ్రంగా కడిగి క్లీన్ చేసుకోవాలి.

ఈ హోమ్ రెమెడీని నిత్యం పాటించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.ఎటువంటి మొండి మచ్చలను అయినా సరే ఈ రెమెడీ ద్వారా సులభంగా నివారించుకోవచ్చు.క్లియర్ స్కిన్ ను పొందవచ్చు.
కాబట్టి మచ్చలతో బాధపడుతున్న వారు తప్పకుండా ఓట్స్ తో ఈ మిరాకిల్ రెమెడీని ట్రై చేయండి.బెస్ట్ రిజల్ట్ ను మీరు గమనిస్తారు.
పైగా ఈ రెమెడీ వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది.టాన్ తొలగిపోయి స్కిన్ షైనీగా మెరుస్తుంది.
అదే సమయంలో చర్మం టైట్ అవుతుంది.ముడతలు దరిదాపుల్లోకి రాకుండా సైతం ఉంటాయి.