జ్యోతిష్యమైనా, ఇంకేదైనా అది మనకు మానసికంగా హెల్ప్ చేస్తుందంటేనే వాటిని నమ్మాలి.లేదంటే వాటిని పట్టించుకోకుండా జీవితంలో కష్టపడి ఎలా ఎదగాలో ఆలోచించాలి.
తల్లిదండ్రులు పిల్లలకు మంచిగా చదువుకొని కష్టపడితేనే జీవితం సుఖమయం అవుతుందని చెప్పాలి.అంతేకానీ వారిపై జ్యోతిష్యం, ఆస్ట్రాలజీ( Astrology ) అంటూ వారి నమ్మకాలను రుద్దకూడదు.
వారి జాతకంలో దోషాలు ఉన్నాయని చెప్పినా భయపడకుండా వారిని జాగ్రత్తగా చూసుకోవాలి.కానీ తెలంగాణలోని హైదరాబాద్‌లో( Hyderabad ) ఒక తండ్రి తన కూతురు జాతకం బాగోలేదని తెలుసుకొని బాగా డిస్టర్బ్ అయ్యాడు.
తర్వాత తన ఎనిమిదేళ్ల బాలికను హత్య చేశాడు.ఆమె జాతకం ప్రకారం భవిష్యత్తులో ఆమెకు కష్టాలు తప్పవని, ఆమె బతికి కూడా వృధా అని నమ్మి అతడు ఆమెను అన్యాయంగా పొట్టన పెట్టుకున్నాడు.వివరాల్లోకి వెళ్తే.తండ్రి చంద్రశేఖర్( Chandrasekhar ) తన కుమార్తె మోక్షజ్ఞను( Mokshagna ) ఆగస్టు 18న సాయంత్రం కారులో తీసుకెళ్లి బ్లేడుతో గొంతు కోసి అత్యంత కిరాతకంగా హత్య చేశాడు.
అనంతరం తారామతిపేట-కోహెడ మధ్య ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్)లో మృతదేహాన్ని పడేయాలని ప్లాన్ చేశాడు.అయితే, అతని కారు పంక్చర్ అయింది.తనకి సహాయం చేయడానికి ఒక బాటసారుడిని ఆపాడు.బాటసారులు కారులో బాలిక మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
చంద్రశేఖర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.హత్యకు గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు, అయితే చంద్రశేఖర్ తన కుమార్తె జాతకాన్ని నమ్మి హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.ఈ విషాద సంఘటన హృదయాలు ఆ అమ్మాయి తల్లి తల్లడిల్లుతోంది.తండ్రి మానసిక స్థితి బాగుందా లేదా అన్న కోణంలోనూ పోలీసులు ఆరా తీస్తున్నారు.ఇది ఏమైనా ఈ హత్య స్థానికంగా చాలామందిని కలచివేసింది.