"ఆచార్య"కి ముందు చిరంజీవి కెరీర్‌లోనే ది వరస్ట్ సినిమాలు అంటే ఇవే!

మెగాస్టార్ చిరంజీవి…( Megastar Chiranjeevi ) పరిచయం అక్కర్లేని పేరు.ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా స్వయం కృషితో నటుడుగా అంచెలంచెలుగా ఎదిగి చిరంజీవి టాలీవుడ్లో మెగాస్టార్ గా అవతరించాడు.

 Chiranjeevi First Day Disaster Talk Movies Details, Chiranjeevi, Chiranjeevi Dis-TeluguStop.com

అలాంటి చిరంజీవి కెరీర్‌లో కూడా మొన్న రిలీజైన ఆచార్య( Acharya ) వంటి దారుణమైన డిజాస్టర్స్ ఉన్నాయని మీకు తెలుసా? ఈతరం వారికి తెలియక పోవచ్చు గానీ నిన్నటి తరానికి బాగా తెలుసు.అవును, అయన ఇండస్ట్రీ హిట్లతో పాటుగా దారుణమైన డిజాస్టర్లు కూడా ఉన్నాయి.

అందుకే ఇపుడు ఇప్పటి వరకు చిరంజీవి కెరీర్ లోనే భారీ డిజాస్టర్ అయిన సినిమాల లిస్ట్ ఒకసారి చూద్దాము.

Telugu Acharya, Anji, Big Boss, Chiranjeevi, Jebu Donga, Lankeswarudu, Raja Vikr

మొన్న కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి, రామ్ చరణ్ కాంబోలో వచ్చిన ఆచార్య సినిమా గురించి ఇక్కడ ఎక్కువ మాట్లాడుకోవలసిన పనిలేదు.ఆ సినిమా చూసి బాధపడ్డ అభిమానులకి ఇంకా ఆగాయం తాలూక ఆనవాళ్లు మానలేదు అనడంలో అతిశయోక్తి లేదు.అవును, భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ మూవీ చిరంజీవి కెరీర్ లోనే భారీ ఫ్లాప్ గా మిగిలింది.

ఈ మూవీ ప్లాప్ అవడంతో నిర్మాతలకు దాదాపు 30 కోట్ల రూపాయల నష్టం వచ్చిందని వినికిడి.దీని నుండి ఇంకాస్త వెనక్కి వెళ్తే బాలీవుడ్లో హిట్ అయిన ‘లగేరహో మున్నాభాయ్’ మూవీని తెలుగులో చిరంజీవి హీరోగా ‘శంకర్ దాదా జిందాబాద్’( Shankar Dada Zindabad ) గా రీమేక్ చేయగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్ద డిజాస్టర్‌గా నిలిచింది.

Telugu Acharya, Anji, Big Boss, Chiranjeevi, Jebu Donga, Lankeswarudu, Raja Vikr

ఇందులో చిరు ఫైట్స్ చేయకపోవడం వల్లనే ప్లాప్ అయిందని మీలో ఎవరికన్నా తెలుసా?అదేవిధంగా బడా సినిమాల దర్శకుడు కోడి రామకృష్ణ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కిన సినిమా అంజి( Anji Movie ) ఏ స్థాయిలో రూపొందిందో అప్పటి వాళ్ళకి బాగా తెలుసు.కాగా ఈ చిత్రం డిజాస్టర్‌గా నిలిచింది.అలాగే చిరంజీవి, రోజా హీరో హీరోయిన్లుగా నటించిన విజయ బాపినీడు సినిమా బిగ్ బాస్ సినిమా( Big Boss Movie ) కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది.అప్పట్లో ఈ సినిమా చాలా అంచనాలతో వచ్చింది.

Telugu Acharya, Anji, Big Boss, Chiranjeevi, Jebu Donga, Lankeswarudu, Raja Vikr

ఇక చిరంజీవి హీరోగా, నగ్మా, సౌందర్య హీరోయిన్లుగా నటించిన మూవీ రిక్షావోడు( Rikshavodu ) పరిస్థితి కూడా అదే.అదేవిధంగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా రవిరాజ పినిశెట్టి దర్శకత్వం వహించిన సినిమా ‘రాజా విక్రమార్క’ సినిమా కూడా ఎన్నో అంచనాలతో తెరకెక్కి బోల్తా పడింది.ఇవి మాత్రమే కాకుండా చిరు హీరోగా కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన మూవీ ‘తినేత్రుడు’, ‘జేబు దొంగ’, చిరంజీవి హీరోగా దాసరి నారాయణ రావు దర్శకత్వంలో వచ్చిన లంకేశ్వరుడు, చిరంజీవి, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కాంబినేషన్ లో వచ్చిన చిత్రం ‘రుద్రనేత్ర’ సినిమాలు అత్యంత దారుణంగా పరాజయం పాలయ్యాయని మీలో చాలా తక్కువ మందికి తెలుసు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube