టీ20 వరల్డ్ కప్ కు భారత జట్టును బీసీసీఐ ( BCCI ) ప్రకటించింది.ఈ మేరకు భారత జట్టు కెప్టెన్ గా రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా వ్యవహరించనున్నారు.
రోహిత్ శర్మ, హార్డిక్ పాండ్యాతో పాటు భారత జట్టులో విరాట్ కోహ్లి, సంజు శాంసన్, రిషబ్ పంత్, శివమ్ దూబె, జడేజా, సూర్యకుమార్, జై స్వాల్, కుల్దీప్ యాదవ్, చాహల్, బుమ్రా, సిరాజ్, అర్షదీప్ సింగ్ ఉన్నారని బీసీసీఐ తెలిపింది.అదేవిధంగా స్టాండ్ బై ప్లేయర్లుగా శుభ్ మన్ గిల్, రింకు సింగ్, ఖలీల్ అహ్మద్, అవేశ్ ఖాన్ ఉన్నారు.
కాగా కేఎల్ రాహుల్, రుతురాజ్ గైక్వాడ్ కు టీ20 టీమ్ లో చోటు దక్కలేదు.అయితే జూన్ 2వ తేదీ నుంచి టీ20 వరల్డ్ కప్( T20 World Cup ) ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.
ఈ మేరకు అమెరికా, వెస్టిండీస్ వేదికగా టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ లు జరగనున్నాయి.







