సాధారణంగా కొందరి దంతాలు గార పట్టి పసుపు రంగులోకి మారుతుంటాయి.ధూమపానం, మద్యపానం, దంత సంరక్షణ లేకపోవడం తదితర అంశాల కారణంగా దంతాలు గార పట్టి పసుపు రంగులోకి మారుతుంటాయి.
ఇటువంటి దంతాలు కలిగిన వారు ఇతరులతో మాట్లాడడానికి, మనస్ఫూర్తిగా నలుగురిలో నవ్వెందుకు ఎంతగానో ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు.ఈ క్రమంలోనే గార పట్టి పసుపు రంగులోకి మారిన దంతాలను తెల్లగా మార్చుకోవడం కోసం రకరకాల టూత్ పేస్ట్ లను వాడుతుంటారు.
అయితే ఒక్కోసారి ఎంత ఖరీదైన టూత్ పేస్ట్ లను వాడినప్పటికీ ఫలితం లభించదు.కానీ ఇప్పుడు చెప్పబోయే పవర్ ఫుల్ హోమ్ రెమెడీని కనుక పాటిస్తే కేవలం మూడు రోజుల్లోనే గార పట్టి పసుపు రంగులోకి మారిన దంతాలు ముత్యాల మెరుస్తాయి.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ పవర్ ఫుల్ రెమెడీ ఏంటో ఓ చూపు చూసేయండి.

ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు లవంగాలు, రెండు టేబుల్ స్పూన్లు మెంతులు వేసుకుని మెత్తని పౌడర్ మాదిరి గ్రైండ్ చేసుకోవాలి.ఆ తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ లవంగాలు మెంతి పొడిని వేసుకోవాలి.అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ రాక్ సాల్ట్, వన్ టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె, వన్ టేబుల్ స్పూన్ నువ్వుల నూనె వేసుకుని బాగా మిక్స్ చేయాలి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బ్రష్ సహాయంతో దంతాలకు అప్లై చేసి కనీసం రెండు నిమిషాల పాటు తోముకోవాలి.ఆ తర్వాత నార్మల్ వాటర్ తో శుభ్రంగా దంతాలను నోటిని క్లీన్ చేసుకోవాలి.ఈ పవర్ ఫుల్ రెమెడీని మూడు రోజులపాటు వరసగా పాటిస్తే గార పట్టి పసుపు రంగులోకి మారిన దంతాలు ముత్యాల మెరుస్తాయి.పైగా ఈ రెమెడీని పాటించడం వల్ల చిగుళ్ల వాపు, చిగుళ్ల నుంచి రక్తస్రావం, దంతాల నొప్పి వంటి సమస్యల నుంచి సైతం ఉపశమనాన్ని పొందుతారు.
కాబట్టి కచ్చితంగా ఈ హోమ్ రెమెడీని పాటించండి.దంతాలను తెల్లగా మెరిపించుకోండి.