మీ శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గాలంటే.. ఈ ఆహారాలను మీ డైట్ లో చేర్చుకోండి..!

ప్రస్తుత సమాజంలో వయసుతో సంబంధం లేకుండా చాలామంది ప్రజలు అధిక కొలెస్ట్రాల్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు.దీనికి ముఖ్య కారణం తినే ఆహారంపై అవగాహన లేకపోవడమే అని నిపుణులు చెబుతున్నారు.

 If You Want To Reduce Bad Cholesterol In Your Body.. Add These Foods In Your Di-TeluguStop.com

ఈ మధ్య కాలంలో చాలా మంది అధికంగా మటన్ తినడం, మద్యం సేవించడం లాంటివి చేస్తున్నారు.ఈ విధంగా చేయడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగిపోతున్నాయి.

కాబట్టి వీటితో ఆరోగ్యం పై చెడు ప్రభావం పడుతుంది.అలాగే చాలామంది ప్రజలు శీతాకాలంలో వ్యాయామం చేయకుండా, అలాగే ఉండడం వల్ల వీరి శరీరంలో విటమిన్ డి లోపిస్తూ ఉంటుంది.

కాబట్టి చలికాలంలో చెడు కొలెస్ట్రాల్( bad cholesterol ) లెవెల్స్ ను తగ్గించుకోవడానికి మంచి కొలెస్ట్రాల్ లెవెల్స్ పెంచుకోవడానికి ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ ఉంచాలి.

Telugu Avocado, Bad Cholesterol, Flax Seeds, Tips, Multi Vitamins-Telugu Health

అయితే చలికాలంలో ఈ ఐదు ఆహారాలను తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు.ఉదయం పూట అల్పాహారం కోసం ఓట్ మిల్ తీసుకోవాలి.దీనిలో ఉండే పీచు పదార్థాలు చెడు కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గించడానికి ఎంతగానో ఉపయోగపడతాయి.

చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించుకునేందుకు ఈ ఆహారాలలో ఫైబర్ రిచ్ ఫుడ్ ను ఎంచుకుంటే మంచి ఫలితం ఉంటుంది.చెడు కొలెస్ట్రాల్ ను నివారించడానికి డ్రై ఫ్రూట్స్ ను తీసుకోవడం ఎంతో అవసరం.

డ్రై ఫ్రూట్స్ లో మల్టీ విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి.తాజా పండ్లను కూడా తీసుకోవడం ఎంతో మంచిది.

Telugu Avocado, Bad Cholesterol, Flax Seeds, Tips, Multi Vitamins-Telugu Health

ఇంకా చెప్పాలంటే అవకాడ( Avocado )లో మోనో శాచురేటెడ్ ఫ్యాటీ ఆసిడ్స్ ఎక్కువగా ఉంటాయి.ముఖ్యంగా చెప్పాలంటే చెడు కొలెస్ట్రాల్ తో ఇబ్బంది పడుతున్న వారు ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్( Omega-3 Fatty Acids ) ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉండాలి.ఈ ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ చియా విత్తనాలు, సముద్రపు ఆహారం, వాల్నట్స్, అవిసె గింజలు( Flax seeds ) లాంటి ఆహారాలలో ఎక్కువగా ఉంటాయి.ఈ కాలంలో బీట్రూట్, ముల్లంగి, పాలకూర మొదలైన కూరగాయలు ఎక్కువగా అందుబాటులో ఉంటాయి.

వీటితో పాటు క్యాలి ఫ్లవర్,బ్రోకలీ, దుంపలు, క్యారెట్, బీన్స్, క్యాబేజీ లాంటి కూరగాయలను కూడా క్రమం తప్పకుండా ఆహారంలో భాగం చేసుకోవాలి.ఇలా చేయడం వల్ల చెడు కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గిపోతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube