హీరోయిన్ మాధవి రెండు సార్లు చేజార్చుకున్న రింగ్ .. మళ్ళీ ఎలా దొరికింది

మాధవి.ఒప్పుడు సౌత్ ఇండియాన ఏలిన నటీమణి.

 Heroine Madhavi Lost Her Favorite Ring 2 Times, Actress Madhavi,heroine Madahvi,-TeluguStop.com

తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంతో పాటు హిందీ పరిశ్రమలోనూ సత్తా చాటింది.అన్ని భాషల్లో టాప్ హీరోలు అందరితోనూ కలిసి నటించింది.

అయితే సినిమాల్లో నటించే సమయంలో తనకు ఓ సెంటిమెంట్ ఉండేది.వాళ్ల అమ్మ తనకు ఐదు రాళ్ల రింగ్ ఇచ్చింది.

అది తన చేతికి ఉన్నంత కాలం మంచి జరుగుతుందని ఆమె నమ్మేది.సినిమాల్లోనూ ఆ ఉంగరం తన చేతికే ఉండేది.

ఆమె రింగ్ గురంచి ఫ్యాన్స్ కూడా ఆమెకు ఉత్తరాలు రాసేవారట.ప్రతి సినిమాలోనూ ఆ ఉంగరం కనిపిస్తుంది.

అదంటే మీకు అంత ఇష్టమా? అని అడిగేవారు.

తనకు ఎంతో సెంటిమెంట్ అయిన ఆ ఉంగరం పోతే ఆమె ఎలా ఫీలవుతుందో తెలుసా? కానీ అదే జరిగింది.కన్నడ సినిమా హ‌నా బ‌ల‌వా.జ‌నా బ‌ల‌వా షూటింగ్ కొనసాగుతోంది.అందులో పొలాల్లో ఓ సీన్ షూట్ చేశవారు.మోకాలి లోతు బురదలో నిలబడి ఒకరి మీద మరొకరు బురద చల్లుకునే సీన్ ఉంటుంది.

ఈ సినిమాలో శంకర్ నాగ్ హీరో.దర్శకుడు రెడీ అనగానే బురద చల్లుతుంది.

అప్పుడే తన చేతికున్న ఉంగరం జారి బురదలో పడిపోతుంది.షాట్ మధ్యలో ఉంగరం వెతకలేదు.

తన లక్కీ రింగ్ పోయింది అనుకుంది.తను కంటతడి పెట్టుకునే పరిస్థితిత ఏర్పడింది.

కానీ బయటకు ఏడ్పు కనిపించకుండా జాగ్రత్త పడింది.సీన్ కట్ చెప్పగానే ఏడుస్తూ దర్శకుడికి విషయం చెప్పింది.

అందరూ వెతకడంతో ఆ రింగ్ దొరికింది.తను చాలా సంతోషపడింది.

Telugu Actress Madhavi, Stone, Shankar Nag, Madahvi, Kamal Haasan, Kollywood, To

మరోసారి కూడా తన రింగ్ అలాగే పడిపోయింది.అమావాస్య చంద్రుడు సినిమా షూటింగ్ కొనసాగుతుంది.బీచ్ లో ఆ రింగ్ పడిపోయింది.వెంటనే హీరో కమల్ హాసన్ గమనించి ఆ రింగును వెంటనే పట్టుకున్నాడు.లేదంటే ఆ రింగ్ సముద్రంలో కలిసి పోయేది.వెంటనే తన రింగ్ తీసుకుంది.

కమల్ కు థ్యాంక్స్ చెప్పింది.అప్పటి నుంచి చాలా జాగ్రత్తగా చూసుకునేది ఆ రింగ్ ను మాధవి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube