లండన్ నుంచి ఇండియాకి వచ్చిన 36 ఏళ్ల బ్రిటీష్ మహిళకు( British Woman ) ఢిల్లీలో ఊహించని కష్టం ఎదురైంది.ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన “వీర్” అలియాస్ కైలాష్ గౌతమ్( Veer Alias Kailash Gautam ) అనే 26 ఏళ్ల వ్యక్తి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
అంతేకాదు, హోటల్ సిబ్బంది వాసిమ్ కూడా ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు.ఈ ఘటన ఢిల్లీలోని( Delhi ) మహిపాల్‌పూర్ ప్రాంతంలో జరిగింది.
పోలీసులు ఇద్దరినీ అరెస్ట్ చేసి రేప్, లైంగిక వేధింపుల కేసులను నమోదు చేశారు.
మార్చి 7న లండన్( London ) నుంచి ఇండియాకు వచ్చిన ఆ మహిళ, మొదట తన స్నేహితులతో కలిసి నాలుగు రోజులు గోవాలో గడిపింది.
ఆ తర్వాత మార్చి 11న ఢిల్లీకి చేరుకుంది.ఎయిర్‌పోర్ట్‌లో ఆమె కోసం కైలాష్ గౌతమ్ ఎదురుచూస్తున్నాడు.ఇద్దరూ కలిసి మహిపాల్‌పూర్‌లోని ఒక హోటల్‌కి ఉదయం 11 గంటల ప్రాంతంలో చెక్ ఇన్ చేశారు.

బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం, గౌతమ్ ఫుల్లుగా మద్యం తాగి ఆమె అభ్యంతరం చెప్పినా వినకుండా అసభ్యంగా ప్రవర్తించాడు.భయంతో ఆమె కాస్త వైన్ తాగింది, ఆ తర్వాత గౌతమ్ ఆమెపై పలుమార్లు అత్యాచారం చేశాడు.ఆమె గది నుంచి బయటకు వెళ్లడానికి ప్రయత్నించగా, గౌతమ్ ఆమెను వెంబడించాడు.
రిసెప్షన్‌లో ఉన్న హోటల్ సిబ్బంది ఆమె బాగా తాగి ఉందని అనుకుని, గౌతమ్‌తో మళ్లీ గదికి పంపించేశారు.

లిఫ్ట్‌లో వెళ్తుండగా, వాసిమ్ ( Wasim ) అనే హౌస్‌కీపింగ్ సిబ్బంది ఆమెను అసభ్యంగా తాకాడట.ఆమె గట్టిగా కేకలు వేయడంతో అతను వెనక్కి తగ్గాడు.తిరిగి గదిలోకి వెళ్లిన తర్వాత కూడా గౌతమ్ ఆమెపై మళ్లీ అత్యాచారం చేశాడు.
రాత్రి 11 గంటలకు గౌతమ్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
మరుసటి రోజు తీవ్రమైన నొప్పి రావడంతో ఆ మహిళ ఆసుపత్రికి వెళ్లింది.
డాక్టర్లు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కేసు వెలుగులోకి వచ్చింది.మొదట వాసిమ్‌ను అరెస్ట్ చేశారు, గౌతమ్ మాత్రం లొకేషన్ మారుస్తూ తప్పించుకు తిరుగుతుండగా పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, గౌతమ్ 12వ తరగతి వరకు చదువుకున్నాడు, నిరుద్యోగి.అతనికి ఇంగ్లీష్ రాదు.ఆన్‌లైన్ ట్రాన్స్‌లేటర్ ఉపయోగించి ఆ మహిళతో ఇన్‌స్టాగ్రామ్‌లో చాట్ చేసేవాడు.ఇద్దరు నిందితులను కోర్టులో హాజరుపరిచారు, కోర్టు వారికి జ్యుడీషియల్ కస్టడీ విధించింది.
ఈ విషయంపై యూకే హై కమిషన్‌కు సమాచారం అందించారు.బాధితురాలు ఇంకా ఢిల్లీలోనే ఉందా లేదా అనేది తెలియాల్సి ఉంది.