జెప్టో డెలివరీ బాయ్( Zepto Delivery Boy ) ఒకరు చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.అతడు లిఫ్ట్ పనిచేయకపోయినా ఏకంగా 12 అంతస్తులు మెట్లు ఎక్కి భారీ కిరాణా సరుకులు డెలివరీ చేశాడు.
కస్టమర్ ఈ విషయాన్ని థ్రెడ్స్‌లో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది.డెలివరీ బాయ్ డెడికేషన్‌ను మెచ్చుకుంటూనే, నిజమైన దయ అంటే ఏంటి? మానవత్వం ఏమైపోయింది? అనే ప్రశ్నలు తెరపైకి తెచ్చారు నెటిజన్లు.
వైరల్ పోస్ట్ ప్రకారం, డెలివరీ బాయ్ ఒక అపార్ట్‌మెంట్ బిల్డింగ్‌కు వెళ్లాడు.తీరా చూస్తే లిఫ్ట్ పనిచేయట్లేదు.అయినా సరే డెలివరీ క్యాన్సిల్ చేయకుండా, ఆ భారీ సరుకులన్నీ మోసుకుంటూ 12 అంతస్తులు ఎక్కాడు.కస్టమర్ ఇంటి తలుపు తట్టేసరికి, ఆ డెలివరీ బాయ్ బాగా అలసిపోయి, ఊపిరి కూడా సరిగా తీసుకోలేక ఇబ్బంది పడ్డాడు.

ఆయన కష్టం చూసి చలించిపోయిన కస్టమర్, టిప్ ఇవ్వబోయాడు.కానీ ఆ డెలివరీ బాయ్ మాత్రం మొదట వద్దన్నాడు.మళ్లీ అడిగినా ససేమిరా అన్నాడు.కస్టమర్ పట్టుబట్టడంతో చివరకు టిప్ తీసుకున్నాడు.“దయ, మానవత్వం చూపించండి, వీలైనప్పుడల్లా డెలివరీ చేసే వారికి రివార్డ్ ఇవ్వండి” అంటూ కస్టమర్ పోస్ట్ ముగించాడు.

ఈ పోస్ట్‌పై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు.కొందరు కస్టమర్( Customer ) చేసిన పనిని మెచ్చుకున్నారు.కష్టపడి పనిచేసే డెలివరీ బాయ్స్‌కు టిప్ ఇవ్వడం మంచి పద్ధతే అని సమర్థించారు.మరికొందరు మాత్రం అసలు విషయం డబ్బులు ఇవ్వడం కాదని, నిజమైన దయ వేరే ఉంటుందని అంటున్నారు.“నువ్వు మెట్లు దిగి రాలేవా? టిప్ ఇచ్చి గొప్పగా ఫీల్ అవుతున్నావా?” అంటూ ఒక నెటిజన్ కస్టమర్‌ను విమర్శించాడు.ఇంకొకరు ఇంకాస్త ముందుకెళ్లి, “నీళ్లు ఇచ్చి కాసేపు కూర్చోమని చెప్పి ఉంటే ఇంకా బాగుండేది” అని సలహా ఇచ్చాడు.
ఇంకొందరు ప్రాక్టికల్‌గా ఆలోచించారు.“కనీసం ఆరు అంతస్తులు కస్టమర్ దిగి వచ్చి ఉంటే బాగుండేది కదా, డెలివరీ బాయ్ ఆరు అంతస్తులు ఎక్కేవాడు” అని అన్నారు.ఇలా చేస్తే డబ్బులు ఇవ్వడం కంటే నిజమైన మానవత్వం చూపించినట్లు అవుతుందని వాదించారు.
ఈ ఒక్క సంఘటన చాలు గిగ్ వర్కర్ల( Gig Workers ) కష్టాల గురించి పెద్ద చర్చ మొదలైంది.డెలివరీ చేసేవాళ్లు రోజు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని, తక్కువ జీతాలు, ఎక్కువ పని గంటలు, ఉద్యోగ భద్రత లేకపోవడం వంటి సమస్యలు వాళ్లకు నిత్యం ఉంటాయని చాలామంది కామెంట్ చేశారు.
టిప్ ఇవ్వడం మంచిదే కానీ.జెప్టో లాంటి కంపెనీలు వాళ్లకు మంచి జీతాలు, పని పరిస్థితులు కల్పించాలని, కస్టమర్ల దయాదాక్షిణ్యాలపై ఆధారపడటం సరికాదని అభిప్రాయపడ్డారు.







