సాధారణంగా ఈ మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా చాలామంది ప్రజలలో అధిక బరువు, ఊబకాయం ముఖ్యమైన సమస్యలలో ఒకటిగా మారిపోయాయి.ఎవరైనా సరే రాత్రికి రాత్రి శరీర బరువు బెల్లీ ఫ్యాట్ మొత్తం తగ్గించుకోవాలంటే అసలు కానీ పని.
ఎందుకంటే శరీర బరువు తగ్గించుకోవాలంటే తప్పకుండా శరీరక శ్రమ చేయవలసి ఉంటుంది.
దీనికోసం ప్రతి రోజు వ్యాయామాలు, వాకింగ్ చేయడం ముఖ్యం.
అంతేకాకుండా తీసుకునే ఆహారాల పై కూడా ప్రత్యేక శ్రద్ధ ఉంచవలసి ఉంటుంది.అయితే పొట్ట చుట్టూ కొలెస్ట్రాలను తగ్గించుకోవడానికి శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పరిమాణాలు వేగంగా తగ్గడానికి తప్పకుండా చాలా రకాల ఇంటి నివారణలను పాటించాల్సి ఉంటుంది.
ఆయుర్వేద నిపుణులు సూచించిన సింపుల్ హోమ్ రెమెడీస్ తో సులభంగా బరువు తగ్గడమే కాకుండా చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.
అయితే దీనికోసం మీరు ప్రతి రోజు తేనే, దాల్చిన చెక్కతో తయారుచేసిన హెర్బల్ టీ ని తాగాల్సి ఉంటుంది.దీనిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.తేనే, దాల్చిన చెక్కలో శరీరానికి కావాల్సిన చాలా రకాల ఔషధ గుణాలు ఉన్నాయి.
అంతేకాకుండా దీనితో తయారు చేసిన టీ నీ ప్రతి రోజు తాగడం వల్ల శరీరానికి ఎన్నో ప్రయోజనాలు లభించడమే కాకుండా పొట్ట చుట్టూ ఉన్న బెల్లీ ఫ్యాట్ సమస్య కూడా సులభంగా తగ్గిపోతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవడానికి ఈ టీ ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక కప్పు నీటిని మరిగించాలి.అందులో అర టీ స్పూన్ దాల్చిన చెక్కపొడి వేయాలి.
ఇలా పొడి వేసిన తర్వాత నీటిని బాగా మరిగించాలి.బాగా మరుగుతున్న నీటిలో రుచికి సరిపడా తేనె వేసుకొని కలుపుకోవాల్సి ఉంటుంది.
ఇలా మరిగిన నీటిని ఒక గ్లాసులో తీసుకొని పై నుంచి పుదీనా ఆకులను వేసుకోవాల్సి ఉంటుంది.ఇలా తయారు చేసిన టీ ని ప్రతిరోజు రెండుసార్లు తీసుకుంటే అనారోగ్య సమస్యలతో పాటు బెల్లీ ఫ్యాట్ కూడా దూరం అవుతుంది.