పిగ్మెంటేషన్.అత్యధికంగా వేధించే చర్మ సమస్యల్లో ఇదీ ఒకటి.
ఎండల ప్రభావం, పోషకాల కొరత, హార్మోనుల స్థాయిలో హెచ్చుతగ్గులు ఏర్పడటం, ఒత్తిడి, కాలుష్యం తదితర కారణాల వల్ల చర్మంపై నలుపు లేదా గోధుమ రంగు మచ్చలు ఏర్పడుతుంటాయి.దీనినే స్కిన్ పిగ్మెంటేషన్ అని అంటారు.
ఈ మచ్చలు చర్మం రంగు కంటే వేరు పాటుగా కనిపిస్తాయి.పైగా చర్మ సౌందర్యాన్ని తీవ్రంగా దెబ్బ తీస్తాయి.
అందుకే పిగ్నెంటేషన్ సమస్యను వదిలించుకోవడం కోసం తెగ హైరానా పడిపోతుంటారు.అయితే ఇకపై వర్రీ వద్దు.
ఇప్పుడు చెప్పబోయే పవర్ ఫుల్ రెమెడీ మీ సమస్యకు బెస్ట్ సొల్యూషన్.మరి ఇంతకీ ఆ రెమెడీ ఏంటో ఓ చూపు చూసేయండి.
ముందుగా ఒక బౌల్‌లో నాలుగు వాల్‌నట్స్, ఒక కప్పు వాటర్ వేసుకుని నైట్ అంతా నానబెట్టుకోవాలి.మరుసటి రోజు నానబెట్టుకున్న వాల్‌నట్స్‌ను వాటర్‌తో సహా మిక్సీ జార్‌లో వేసి మెత్తటి పేస్ట్‌గా గ్రైండ్ చేసుకోవాలి.
ఇప్పుడు మరో బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల శెనగపిండి, వన్ టేబుల్ స్పూన్ తేనె, రెండు టేబుల్ స్పూన్ల రోజ్ వాటర్, వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి.

చివరిగా అందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న వాల్‌నట్స్ పేస్ట్ ను కూడా వేసి బాగా కలుపుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఏదైనా బ్రష్ సాయంతో ముఖానికి కాస్త మందంగా అప్లై చేసుకుని ఆరబెట్టుకోవాలి.కంప్లీట్ గా డ్రై అయిన వెంటనే గోరు వెచ్చని నీటితో శుభ్రంగా ఫేస్‌ను క్లీన్ చేసుకుని.
ఏదైనా మాయిశ్చరైజర్ లేదా సీరమ్‌ను అప్లై చేసుకోవాలి.రోజుకు ఒకసారి ఈ రెమెడీని పాటిస్తే పిగ్మెంటేషన్ సమస్య క్రమంగా దూరం అవుతుంది.
ఎలాంటి మచ్చలున్నా మాయమై ముఖం అందంగా, కాంతివంతంగా మారుతుంది.