బాడీ మెటబాలిజంను నాశనం చేసే ఫుడ్స్ ఇవే..!

మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన మన బాడీ మెటబాలిజం అంటే మన శరీర జీవక్రియ రేటు అనేది పూర్తిగా తగ్గిపోతుంది.అలా కనుక జరిగితే మన ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం.

 These Are The Types Of Foods That Can Destroy Body Metabolism Body Metabolism, I-TeluguStop.com

మరి మనం చేసే ఎటువంటి పనుల వలన మన శరీర జీవక్రియ రేటు అనేది తగ్గిపోతుందో తెలుసుకుందామా.చాలా మంది తాము లావుగా ఉన్నామనే కారణం చేత కేలరీలు తక్కువగా ఉండే ఫుడ్‌ను తీసుకుంటూ ఉంటారు.

అలా తక్కువ మోతాదులో కేలరీలు ఉండటం వల్ల బాడీ మెటబాలిజం రేటు తగ్గిపోతుంది.అలా కేలరీలు తక్కువగా ఉన్న ఆహారం కంటే వేళకు వ్యాయామం చేయడం, ఆటలు ఆడడం వంటి శారీరక శ్రమ వలన కేలరీలు తగ్గించుకోవచ్చు.

అంతే కాకుండా చెక్కెర ఎక్కువగా ఉన్న పానీయాలు తాగడం వల్ల కూడా బాడీ మెటబాలిజం రేటు తగ్గిపోతుంది.ప్రోటిన్లు పుష్కలంగా ఉన్న ఫుడ్‌ను తీసుకోవడం శరీరానికి ఎంతో అవసరం.

జీవక్రియ రేటు పడిపోవడానికి గల కారణాల్లో నిద్ర లేమి సమస్య కూడా ఒకటి అనే చెప్పాలి.నిద్ర అనేది శరీరంపై చాలా ప్రభావం చూపుతుంది.

శరీరానికి ఆహారం ఎలాగో.కంటికి నిద్ర కూడా అంతే అవసరం.

తక్కువ సమయం నిద్రపోవడం వల్ల లేని పోని అనారోగ్య సమస్యలు వస్తాయి.డిప్రెషన్ లోకి వెళ్లడం,డయాబెటీస్, బరువు పెరగడంతో పాటుగా మెటబాలిక్‌ రేటు కూడా పడిపోతుంది.

ఈ కాలంలో చాలామంది బరువు తగ్గడం కోసం చేసే అతి పెద్ద పొరపాటు ఏంటంటే బ్రేక్‌ఫాస్ట్‌ను తినకుండా ఉండడం అలా చేయడం వలన దాని ప్రభావం మెటబాలిజంపై పడుతుంది.మద్యం అలవాటు ఉన్నవాళ్లు కూడా సాధ్య మైనంత వరకు దానికి దూరంగా ఉంటేనే మంచిది.

అతిగా మద్యం సేవించడం వలన మెటబాలిజం రేటుపై ప్రభావం పడుతుంది.

అలాగే పండ్లు, కూరగాయలలో కార్బొహైడ్రేట్స్‌ పుష్కలంగా ఉంటాయి.తెల్లగా ఉండే చెక్కెర వంటివి రీఫైన్డ్‌ చేసిన వాటిలో అధిక మొత్తంలో ఉన్న ఫైబర్, తృణధాన్యాలు జీవక్రియ ను నెమ్మదిస్తాయి.బరువు తగ్గించుకోవాలి అనే ఆరాటంలో పడి సరిగా తినకపోతే జీవక్రియ రేటు తగ్గిపోతుంది.

అలాగే చాలా మంది చేసే తప్పు ఏంటంటే శరీరానికి సరిపోయే నీటిని తీసుకోకుండా ఉండడం.అలా శరీరానికి సరిపడా నీటిని తాగకపోతే మెటబాలిజం రేటు పడి పోతుంది.

మనం తీవ్రమైన ఒత్తిడికి లోనయినప్పుడు శరీరం కార్టిసల్‌ అనే హార్మోన్ ను ఉత్పత్తి చేస్తుంది.ఆ హార్మోన్ ఎక్కువగా రిలీజ్ అయితే జీవక్రియ రేటు తగ్గిపోతుంది.పైన చెప్పిన విషయాలు అన్ని గుర్తు పెట్టుకుని మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకోండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube