తెలంగాణ గిరిజన రిజర్వేషన్ పెంపు ఉత్తర్వులపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.పిటిషన్లపై జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ దీపాంకర్ దత్తా ధర్మాసనం విచారణ చేపట్టింది.
ఈ మేరకు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని పిటిషనర్లకు సూచించింది.
రాజ్యాంగ విరుద్ధంగా ఉన్న జీవోను కొట్టివేయాలని సుప్రీంకోర్టులో ఆదివాసీ సంఘాల పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
కొత్త జీవోతో రిజర్వేషన్లు 50 శాతం దాటుతాయని ఆదివాసీ సంఘాలు చెబుతున్నాయి.అంతేకాదు చెల్లప్ప కమిషన్ 9 శాతం వరకే రిజర్వేషన్లు పెంచుకోవాలని సూచించిందని ఆదివాసీ సంఘాలు తెలిపాయి.
తెలంగాణ జీవోతో సుగాలి, లంబాడా, బంజారాలకు మాత్రమే లబ్ధి చేకూరుతుందని వాదనలు వినిపించింది.తెలంగాణ హైకోర్టులో జీవోను సవాల్ చేయాలని సూచించింది.