అందుకే రిటైర్మెంట్ ఇచ్చాను.. రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు

టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్( Ravichandran Ashwin ) అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.ఎలాంటి వీడ్కోలు మ్యాచ్ లేకుండానే రిటైర్మెంట్( Retirement ) ప్రకటించిన అశ్విన్, ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడో తన యూట్యూబ్ ఛానల్‌ ద్వారా వివరించాడు.

 Cricketer Ravichandran Ashwin Key Comments About His Retirement Details, Ravicha-TeluguStop.com

ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో( Border-Gavaskar Trophy ) తొలి మూడు మ్యాచ్‌లలో కేవలం ఒక మ్యాచ్ ఆడటంతో, తనలో క్రియేటివిటీ తగ్గినట్లుగా అనిపించిందని అశ్విన్ చెప్పాడు.ఈ కారణంతోనే రిటైర్మెంట్ ప్రకటించానని ఆయన తెలిపాడు.

అంతేకాకుండా.నా స్థానంలో మరో ఆటగాడికి అవకాశం ఇవ్వడం అవసరం.

జట్టులో స్థానం లేకుండా మిగిలిపోయే కంటే, సమయం వచ్చినప్పుడు రిటైర్మెంట్ ప్రకటించడం మంచిదని భావించాను.ఫేర్వెల్ మ్యాచ్ కోసం జట్టులో కొనసాగడం నాకు ఇష్టం లేదని అశ్విన్ స్పష్టం చేశాడు.

Telugu Anil Kumble, Ashwin, Gavaskar Trophy, Cricket, Farewell, Indian Cricket,

ఇక అశ్విన్ రిటైర్మెంట్ నిర్ణయం వెనుక అవమానాల కారణం ఉందంటూ వస్తున్న వార్తలను కూడా ఆయన కొట్టిపారేశాడు.ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని, అవన్నీ వట్టి ఊహాగానాలేనని అశ్విన్ స్పష్టం చేశాడు.గత ఏడాది డిసెంబర్ 18న గబ్బా టెస్టులో రవిచంద్రన్ అశ్విన్ భావోద్వేగభరితంగా రిటైర్మెంట్ ప్రకటించాడు.విరాట్ కోహ్లీని కౌగిలించుకుని, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌తో మాట్లాడి, ఆపై రోహిత్ శర్మతో కలిసి విలేకరుల సమావేశంలో తన నిర్ణయాన్ని వెల్లడించాడు.

Telugu Anil Kumble, Ashwin, Gavaskar Trophy, Cricket, Farewell, Indian Cricket,

ఇక అశ్విన్ తన క్రికెట్ జీవితంలో భారత తరపున అన్ని ఫార్మాట్లలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు.టెస్టుల్లో 537 వికెట్లు, వన్డేల్లో 156 వికెట్లు, టీ20ల్లో 72 వికెట్లు పడగొట్టి, మొత్తం 765 వికెట్లు తీసుకున్నాడు.అశ్విన్ కంటే ముందు అనిల్ కుంబ్లే (953 వికెట్లు) మాత్రమే ముందున్నారు.అంతర్జాతీయ క్రికెట్‌కు తన సేవలను సమర్పించిన రవిచంద్రన్ అశ్విన్, తన రిటైర్మెంట్ ప్రకటనతో అభిమానులను కలచివేశాడు.

అతని రికార్డులు, ప్రతిభ భారత క్రికెట్ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube