గ్రీన్ టీని ఇలా తీసుకుంటే మరింత వేగంగా బరువు తగ్గుతారు..తెలుసా?

గ్రీన్ టీ.దీని గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.

 Lose Weight Faster If You Consume Green Tea Like This! Green Tea, Weight Loss Dr-TeluguStop.com

ఇటీవల రోజుల్లో ప్రతి ఒక్కరూ తమ డైట్ లో గ్రీన్ టీ ఉండేలా చూసుకుంటున్నారు.ముఖ్యంగా హెల్త్, ఫిట్ నెస్ పై ప్రత్యేక శ్రద్ధ ఉన్నవారు గ్రీన్ టీ తో తమ రోజు ప్రారంభిస్తుంటారు.

ఆరోగ్యపరంగా గ్రీన్ టీ అనేక ప్రయోజనాలను చేకూరుస్తుంది.వెయిట్ లాస్ కు ఉత్తమం గా సహాయపడుతుంది.

అయితే చాలా మంది గ్రీన్ టీను నేరుగా తాగలేకపోతుంటారు.అలాంటి వారు ఇప్పుడు చెప్పబోయే విధంగా తీసుకుంటే మరింత వేగంగా బరువు తగ్గుతారు.

అదే సమయంలో ఎన్నో ఆరోగ్య లాభాలు సైతం లభిస్తాయి.

అందుకోసం ముందుగా ఒక కప్పు హాట్ వాటర్ తీసుకుని అందులో ఒక గ్రీన్ టీ బ్యాగ్ వేసి వదిలేయాలి.

ఆ తర్వాత ఒక యాపిల్ ను తీసుకుని నీటిలో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.అలాగే రెండు స్ట్రాబెర్రీ పండ్లు( Strawberry fruits ) తీసుకుని వాటర్ తో కడిగి ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి.

ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న యాపిల్ ముక్కలు( Apple slices ), స్ట్రాబెర్రీ ముక్కలు మరియు కొద్దిగా వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

Telugu Applestrawberry, Green Tea, Tips, Latest-Telugu Health

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్ట్రైన‌ర్‌ సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.ఈ జ్యూస్ లో ముందుగా తయారు చేసి పెట్టుకున్న గ్రీన్ టీ, రెండు ఐస్ క్యూబ్స్, వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్( Lemon juice ), వన్ టేబుల్ స్పూన్ తేనె( honey ) వేసి బాగా మిక్స్ చేసి సేవించడమే.ఈ యాపిల్ స్ట్రాబెర్రీ గ్రీన్ టీని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల మెటబాలిజం రేటు అద్భుతంగా ఇంప్రూవ్ అవుతుంది.

అతి ఆకలి సమస్య దూరం అవుతుంది.చిరు తిండ్లపై మనసు మళ్లకుండా ఉంటుంది.

ఫలితంగా వెయిట్ లాస్ అవుతారు.

Telugu Applestrawberry, Green Tea, Tips, Latest-Telugu Health

అంతేకాదు పైన చెప్పిన విధంగా గ్రీన్ టీ ను తీసుకుంటే మైండ్ రిఫ్రెష్ అవుతుంది.ఒత్తిడి ఆందోళన డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు దూరం అవుతాయి.రక్తపోటు అదుపులో ఉంటుంది.

శరీరంలో పేరుకుపోయిన మలినాలు తొలగిపోతాయి.బాడీ డిటాక్స్ అవుతుంది.

తలనొప్పి ఉంటే తక్షణ ఉపశమనం లభిస్తుంది.జీర్ణ వ్యవస్థ చురుగ్గా మారుతుంది.

గుండె పోటు వచ్చే రిస్క్ తగ్గుతుంది.మరియు చర్మం నిగారింపుగా సైతం మెరుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube