మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు విమర్శలు గుప్పించారు.పొంగులేటి ఓ రాజకీయ ఉన్మాదని మండిపడ్డారు.
పొంగులేటి తన స్థాయిని మరచి కేసీఆర్, కేటీఆర్ లపై విమర్శలు చేస్తున్నారన్నారు.తన కుటుంబంలో పెళ్లిని కూడా పొంగులేటి రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ క్రమంలోనే పొంగులేటి ఆర్థిక నేరాలతో పాటు భూ దందాలను త్వరలోనే బయటపెడతానని పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో పొంగులేటి ఆర్థిక నేరాలపై సీబీసీఐడీ విచారణ జరపాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామని వెల్లడించారు.







