ఏపీ మంత్రులకు ఆ దమ్ము లేదా ?

ఏపీ పాలిటిక్స్ ( AP Politics )కు సంబంధించిన చర్చ ఎప్పుడొచ్చిన.రాష్ట్రాన్ని వెంటాడుతున్న కొన్ని సమస్యలు వెంటనే అందరి మైండ్ లోకి వస్తాయి.

 Do Ap Ministers Have That Guts , Allegations On Ap Ministers , Ap Politics ,-TeluguStop.com

ఏపీలో స్థిరమైన రాజధాని ఏది ? ఎప్పుడు పోలవరం( Polavaram ) పూర్తవుతుంది ? విశాఖా స్టీల్ ప్లాంట్( Visakha Steel Plant ) సంగతేంటి ? కడప స్టీల్ ప్లాంట్, విశాఖ రైల్వే జోన్, .అబ్బో ఇలా ఒక్కటేంటి ఎన్నో సమాధానం లేని ప్రశ్నలు ఉత్పన్నమౌతాయి.మరి ఈ ప్రశ్నలన్నిటికి సమాధానం లేదా ? సమాధానం చెప్పాల్సిన ప్రభుత్వం ఎందుకు దాటవేసే దొరణి ఎందుకు అవలంభిస్తోంది అనే సందేహాలు ప్రతిఒక్కరిలోనూ వ్యక్తమౌతూనే ఉంటాయి.ప్రత్యేక హోదా సాధిస్తామని చెప్పిన చంద్రబాబు.

( Chandrababu ).హామీని నెరవేర్చకుండానే అధికారాన్ని కోల్పోయారు.

Telugu Ap Ministers, Ap, Chandrababu, Polavaram, Railway Zone, Telanganaharish,

ఇక కేంద్రం మేడలు వొంచుతాం.ప్రత్యేక హోదా సాధిస్తామని ఎన్నికల ముందు ఫెరోషియస్ గా చెప్పిన జగన్( Jagan ).అధికారంలోకి వచ్చాక ఆ ఊసే ఎత్తడం లేదు.ఇక అప్పుడప్పుడు పార్లమెంట్ లో ఏదో నామమాత్రంగా హోదా విషయాన్ని ప్రస్తావించినప్పటికి కేంద్రం నో అని చెప్తునే ఉంది.

దాంతో అడగడమే మానేశారు మన ప్రభుత్వ నేతలు.ఇదే ఇలా ఉంటే విశాఖా స్టీల్ ప్లాంట్ రద్దు అంశం ఇంకోలా ఉంది.స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ రద్దు కు తాము వ్యతిరేకమని చెబుతున్నా.దీనిపై కేంద్రంతో పోరాడే ప్రయత్నం చేయడం లేదు.

అలాగే రైల్వే జోన్ ( Railway Zone )విషయంలో కేంద్రాన్ని గట్టిగా అడగడం లేదు.దీంతో ఏపీ ప్రభుత్వంపై అటు ప్రతిపక్షల నుంచి ఇటు ప్రజల నుంచి వస్తున్న విమర్శలు అన్నీ ఇన్ని కావు.

Telugu Ap Ministers, Ap, Chandrababu, Polavaram, Railway Zone, Telanganaharish,

ఇప్పుడు ఏకంగా పక్కా రాష్ట్ర మంత్రులే ఏపీ మంత్రులను చేతకాని వారిలో చూస్తున్నారంటే ఇందులో ఏమాత్రం అతిశయోక్తి లేదు.విశాఖా స్టీల్ ప్లాంట్ విషయంలో కే‌సి‌ఆర్ చొరవ చూపడంతోనే కేంద్రం వెనక్కి తగ్గిందని, ఎందులో ఏపీ ప్రభుత్వం ప్రమేయమే లేదని పక్కా రాష్ట్రం బి‌ఆర్‌ఎస్ నేతల నుంచి వినిపిస్తున్న మాట.దాంతో అగ్గిమీద గుగ్గిలం అవుతున్న ఏపీ మంత్రులు తెలంగాణ మంత్రులపై తీవ్ర విమర్శలతో విరుచుకుపడుతున్నారు.అయితే విమర్శలు చేయడంపై కేటాయించే సమయాన్ని ఏపీని అభివృద్ది చేయడంపై కేటాయిస్తే మంచిదని చెబుతున్నారు టి‌ఎస్ మంత్రులు.

నిజంగా మీకు చేతనైతే ప్రత్యేక హోదా కోసం పోరాడండి, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ రద్దుకై పోరాడండి.? మీకు పోరాడే దమ్ము అంటూ తెలంగాణ మంత్రి హరీష్ రావు లాంటి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు.ఈ ప్రశ్నకు ఏపీ మంత్రుల వద్ద సమాధానం ఉందా ? అంటే లేదనే చెప్పాలి.మొత్తానికి ఎపి మంత్రుల అసమర్థతను ఇతర రాష్ట్ర మంత్రులు వేలెత్తి చూపుతున్నారంటే.

ఏపీ దౌర్భాగ్యం ఏ స్థాయిలో ఉందనేది అతివాదుల ఆవేదన.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube