ఘాటైన రుచి, వాసన కలిగి ఉండే మిరియాలు సుగంధ ద్రవ్యాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాయి.అందుకే వంటల్లో విరి విరిగా ఉపపయోగించే మిరియాలను.
క్వీన్ ఆఫ్ స్పైసెస్ గా సంభోదిస్తుంటారు.అయితే చాలా మందికి నల్ల మిరియాల గురించే తెలుసు.
కానీ, మిరియాల్లోనే తెల్ల మిరియాలూ ఉంటాయి.ఇవి కూడా ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను అందిస్తాయి.
అనేక జబ్బులను నివారిస్తాయి.మరి ఆలస్యం చేయకుండా తెల్ల మిరియాల వల్ల పొందే లాభాలు ఏంటీ? వాటిని ఎలా తీసుకోవాలి? అన్న విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
తెల్ల మిరియాల్లో కాల్షియం, పొటాషియం, సోడియం, జింక్, మెగ్నీషియం, ఫాస్పరస్, ఐరన్, విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ కె, విటమిన్ ఇ, ఫైబర్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా ఎన్నో పోషకాలు నిండి ఉంటాయి.అందుకే తెల్ల మిరియాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
ముఖ్యంగా ఒత్తిడి, డిప్రెషన్, ఆందోళన వంటి సమస్యలతో బాధ పడే వాడు.ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో పావు స్పూన్ తెల్ల మిరియాల పొడి కలిపి తీసుకోవాలి.

ఇలా ప్రతి రోజు చేస్తే మానసిక సమస్యలు పరార్ అవుతాయి.అలాగే జలుబు, దగ్గు, గొంతు నొప్పి, కఫం సమస్యలతో ఇబ్బంది పడే వారు.ఒక కప్పు నీటిలో పావు స్పూన్ తెల్ల మిరియాల పొడి వేసి బాగా మరిగించి తీసుకోవాలి.ఇలా రోజుకు ఒక సారి చేస్తే జలుబు, దగ్గు, గొంతు నొప్పి సమస్యలు దూరం అవ్వడంతో పాటు రోగ నిరోధక శక్తి బలపడుతుంది.

తెల్ల మిరియాలలో క్యాప్సైసిన్ కంటెంట్ ఉంటుంది.ఇది శరీరంలోని క్యాన్సర్ కణాలను నాశనం చేయడంలో గ్రేట్‌గా సహాయపడుతుంది.అందువల్ల, తెల్ల మిరియాల పొడిని వంటలలో, సలాడ్స్‌లో, సూప్స్‌లో కలిపి తీసుకుంటే మంచిది.ఇక తెల్ల మిరియాలను తీసుకోవడం వల్ల రక్త పోటు అదుపులో ఉంటుంది.గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది.కీళ్ల నొప్పులు దూరం అవుతాయి.
మరియు చర్మ అలర్జీలు, మొటిమలు కూడా తగ్గుతాయి.