తమ జీవితంలో గర్భం దాల్చడం ఎంతో ముఖ్యమని దాదాపు చాలామంది మహిళలు భావిస్తారు.ప్రసవం తర్వాత కూడా వారి జీవితంలో అంతే ముఖ్యం.
ప్రసవం తర్వాత కూడా స్త్రీ తన ఆరోగ్యంతో పాటు తన బిడ్డ ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ వహించాల్సి ఉంటుంది.ముఖ్యంగా తొలి రోజులలో శిశువు ఆహారం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.
నవజాత శిశు ఆరోగ్యానికి తల్లిపాలు ఎంతో ముఖ్యమైనవి.అయితే తల్లిపాలు( breast milk ) పిల్లలకు సరిగ్గా ఉంటేనే వారి ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.
మహిళలు గర్భధారణ సమయంలో ప్రసవానంతరం చాలా బిజీగా ఉంటారు.ప్రసవం తర్వాత పిల్లల పెంపకానికి ఎక్కువ సమయం వేచిస్తూ ఉంటారు.
అందుకే చాలామంది మహిళలకు వ్యక్తిగత సమయం అసలు ఉండదు.అయితే కొంతమంది తల్లులు బిడ్డకు పాలిచ్చేటప్పుడు స్మార్ట్ ఫోన్ ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.
పాలు పట్టే సమయంలో మొబైల్ వాడటం వల్ల బిడ్డ ఆరోగ్యం దెబ్బతింటుందా? ఆరోగ్యా నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.శిశువుకు పాలిచ్చే సమయంలో విశ్రాంతి తీసుకోవడానికి తల్లులకు సమయం ఉండదు.
కొన్నిసార్లు శిశువు పాలు తాగుతుంటే తల్లులు ఫోన్ ఉపయోగిస్తూ ఉంటారు.

ఇది ఏ మాత్రం మంచిది కాదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.తల్లిదండ్రులు పిల్లలు ఒకరికొకరు దగ్గరగా ఉన్నప్పుడు మొబైల్ ఫోన్లు( Mobile phones ) వాడకూడదని సూచిస్తున్నారు.స్మార్ట్ ఫోన్లు( Smart phones ) మన జీవితాలను సులభంతరం చేసినప్పటికీ మరోవైపు తల్లిపాలు ఇవ్వడంలో స్మార్ట్ ఫోన్ల వాడకం బిడ్డపై తల్లిదృష్టిని, తల్లి శరీర ఉత్తేజాన్ని ప్రభావితం చేస్తుందని చెబుతున్నారు.
తల్లి పాలు ఇవ్వడంలో స్మార్ట్ ఫోన్ వాడకం తల్లి భంగిమ బిడ్డతో కమ్యూనికేషన్ పై ప్రభావం చూపే అవకాశం ఎక్కువగా ఉంది.దీని వల్ల తల్లికి వెన్నునొప్పి వచ్చే ప్రమాదం కూడా ఉంది.
స్మార్ట్ ఫోన్ వాడకం వల్ల తల్లులకు పిల్లలతో కమ్యూనికేషన్ తగ్గిపోతుందని ఇప్పటికే ఎన్నో అధ్యాయాలు నిరూపించాయి.ఇది శిశువు సున్నితంగా స్పందించే సామర్ధ్యానికి ఆటకం కలిగిస్తుంది.తద్వారా పిల్లల్లో ఒత్తిడి పెరిగిపోతుంది.అంతేకాకుండా జ్ఞాపకశక్తి సామర్థ్యం కూడా తగ్గే అవకాశం ఉంది.