వయసు పెరిగినా యవ్వనంగా కనిపించాలనే కోరిక ఎవరికి ఉండదు చెప్పండి.స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా దాదాపు అందరూ అదే కోరుకుంటారు.
కానీ జీవనశైలిలో మార్పులు, ఒత్తిడి, ఆహారపు అలవాట్లు, కంటి నిండా నిద్ర లేకపోవడం తదితర కారణాల వల్ల చాలా మంది చిన్న వయసులోనే వృద్ధాప్య లక్షణాలను ఫేస్ చేస్తున్నారు.ఈ క్రమంలోనే వాటి నుంచి బయట పడటం కోసం మార్కెట్లో లభ్యమయ్యే ఖరీదైన చర్మ ఉత్పత్తులను కొనుగోలు చేసి వాడుతున్నారు.
అయితే వాటి వల్ల ఎంత ప్రయోజనం ఉంటుందో తెలియదు కానీ.ఇప్పుడు చెప్పబోయే చిట్కాను పాటిస్తే మాత్రం యాభై లోనూ యవ్వనంగా మెరిసిపోవడం ఖాయం.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ చిట్కా ఏంటో తెలుసుకుందాం పదండి.ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో నాలుగు బాదం పప్పులు, రెండు టేబుల్ స్పూన్ల వేపుడు శనగపప్పు, వన్ టేబుల్ స్పూన్ అవిసె గింజలు వేసి మెత్తని పౌడర్‌లా గ్రైండ్ చేసుకోవాలి.
ఇలా గ్రైండ్ చేసుకున్న పౌడర్‌లో రెండు టేబుల్ స్పూన్ల పాలు, రెండు టేబుల్ స్పూన్ల రోజ్ వాటర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.నైట్ నిద్రించే ముందు ముఖానికి ఉన్న మేకప్ మొత్తాన్ని తొలగించి వాటర్ తో క్లీన్ చేసుకోవాలి.
ఆ తర్వాత తయారు చేసుకున్న మిశ్రమాన్ని ముఖానికి మరియు మెడకు కాస్త మందంగా అప్లై చేసుకోవాలి.
కంప్లీట్‌గా ఆరిన అనంతరం నిద్రించాలి.మరుసటి రోజు ఉదయాన్నే చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రంగా వాష్ చేసుకోవాలి.ఇలా ప్రతిరోజు నైట్ నిద్రించే ముందు కనుక చేస్తే ముఖం యవ్వనంగా మరియు కాంతివంతంగా మెరుస్తుంది.
ముడతలు, సన్నని చారలు వంటి వృద్ధాప్య లక్షణాలు ఏవి దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.వయసు పెరిగినా యంగ్ గానే కనిపిస్తారు.