సమ్మర్ బరిలో గెలిచే పోలీస్ ఎవరు.. ఈ ప్రశ్నకు సమాధానం దొరికేది ఎప్పుడో?

సినిమా ఇండస్ట్రీలో హీరోలు పోలీస్ క్యారెక్టర్ లో( Police Characters ) నటించిన సినిమాలు ఇప్పటికే చాలా విడుదలైన విషయం తెలిసిందే.ముఖ్యంగా కొంతమంది హీరోలకు పోలీస్ డైరెక్టర్లు బాగా సెట్ అయ్యాయని చెప్పవచ్చు.

 Police Mass Stories In Telugu Movies Details, Raviteja, Vijay Devarakonda, Tolly-TeluguStop.com

దానికి తోడు సరైన కథ దొరికితే చాలు ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ సృష్టించడం ఖాయం అని చెప్పవచ్చు.ఇకపోతే ప్రస్తుతం తెలుగులో ఈ పోలీసు కథల జోరు బాగా కనిపిస్తోంది.

ముఖ్యంగా ఈ వేసవికి బాక్సాఫీస్‌ బరిలో పోటీ పడుతున్న హీరోల్లో పలువురు పోలీసు పాత్రలతోనే అలరించేందుకు సిద్ధమవుతుండటం అందరిలోనూ ఆసక్తిరేకెత్తిస్తోంది.ఇంతకీ ఆ సినిమాలు ఏవి ఆ హీరోలు ఎవరు అన్న విషయానికి వస్తే.

తెలుగు సినిమా ఇండస్ట్రీలో పోలీస్ క్యారెక్టర్ బాగా సెట్ అయ్యే హీరోలలో రవితేజ( Ravi Teja ) కూడా ఒకరు.పోలీసు కథలకు రవితేజ చిరునామాగా నిలుస్తూ ఉంటారు.

ఇప్పటికే చాలా సినిమాలలో పోలీస్ క్యారెక్టర్ లో నటించి మెప్పించారు రవితేజ.ఇప్పుడు మాస్ జాతర( Mass Jathara Movie ) అనే సినిమాలో కూడా పోలీస్ క్యారెక్టర్ లో నటిస్తున్నట్టు తెలుస్తోంది.

ఈ సినిమా సమ్మర్ కానుకగా విడుదల కాబోతున్నట్టు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.కొత్త దర్శకుడు భాను భోగవరపు ఈ సినిమాను రూపొందిస్తున్నారు.

సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్గా నటిస్తున్నట్టు తెలుస్తోంది.

Telugu Nani, Mass Jathara, Characters, Raviteja, Tollywood, Tyson-Movie

మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ముస్తాబవుతున్న ఈ సినిమాలో రైల్వే పోలీసుగా లక్ష్మణ్‌ భేరి అనే పాత్రలో అలరించనున్నారు రవితేజ.ప్రస్తుతం ముగింపు దశలో ఉన్న ఈ చిత్రం ఈ వేసవిలోనే ప్రేక్షకుల్ని పలకరించనుంది.పోలీస్ క్యారెక్టర్ లో నటిస్తున్న మరొక హీరో నాని.

( Hero Nani ) హిట్‌: ది థర్డ్‌ కేస్‌( Hit: The Third Case ) సినిమాలో పోలీసు పాత్రలో అభిమానును పలకరించేందుకు సమాయత్తమవుతున్నారు.తన హిట్‌ ఫ్రాంఛైజీలో భాగంగా శైలేశ్‌ కొలను తెరకెక్కిస్తున్న చిత్రం ఇది.విభిన్నమైన క్రైమ్‌ థ్రిల్లర్‌ కథాంశంతో ముస్తాబవుతున్న ఈ సినిమాలో అర్జున్‌ సర్కార్‌ అనే శక్తిమంతమైన పోలీసుగా కనువిందు చేయనున్నారు నాని.ఈ చిత్రం మే 1న విడుదల కానుంది.

అలాగే రౌడీ హీరో విజయ్ దేవరకొండ( Vijay Devarakonda ) ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు.

Telugu Nani, Mass Jathara, Characters, Raviteja, Tollywood, Tyson-Movie

ఇందులో విజయ్ దేవరకొండ పోలీస్ క్యారెక్టర్ లో నటిస్తున్నట్టు తెలుస్తోంది.ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుండగా తొలి భాగం చిత్రీకరణ ఇప్పటికే ముగింపు దశకు చేరుకుంది.ఇది మేలో బాక్సాఫీస్‌ ముందుకు రానున్నట్లు తెలిస్తోంది.

అలాగే యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్,( Bellamkonda Saisrinivas ) సాగర్ చంద్ర కాంబినేషన్ లో రాబోతున్న చిత్రం టైసన్ నాయుడు( Tyson Naidu Movie ) ఈ సినిమాలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పోలీస్ క్యారెక్టర్ లో నటించారట.ఈ సినిమా సమ్మర్ కానుకగా విడుదల కానున్నట్టు తెలుస్తోంది.

మరి ఈ హీరోలలో సమ్మర్ బరిలో గెలిచేది ఎవరో చూడాలి మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube