అగ్గి పుల్ల, సబ్బు బిళ్ళ, కుక్క పిల్ల కాదేది కవితకు అనర్హం అన్నారు.మరి ఇప్పుడు సినిమా పేర్లకు కూడా అలాంటి హద్దులు పెట్టుకోవడం లేదు మన తెలుగు సినిమా దర్శకులు.
రోజులు మారుతున్న కొద్ది వింత వింత టైటిల్స్ పెడుతూ జనాల్లో క్రేజ్ పెంచుకునే పనిలో పడ్డారు.అందుకే ఇప్పుడు తాజాగా సోమవారం నుంచి శనివారం వరకు వారాల పేర్లతో సినిమాలు సందడి చేస్తున్నాయి.మరి అలా వారాల పేర్లతో వచ్చిన సినిమాలు ఏంటి అనే విషయం ఈ ఆర్టికల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
సరిపోదా శనివారం
ఎప్పుడు వింత టైటిల్స్ తో జనాల్లో క్రేజ్ పెంచుకునే దర్శకుడు వివేక్ ఆత్రేయ. గతంలో అంటే సుందరానికి సినిమా తీసి పర్వాలేదు అనిపించుకున్నాడు కానీ వెరైటీ టైటిల్ పెట్టాడనే పేరు మాత్రం దక్కింది ఇప్పుడు కూడా అదే రూట్లో సరిపోదా శనివారం( Saripodhaa Sanivaaram ) అనే పేరుతో నానితో మరో సినిమా చేయబోతున్నాడు.మరి ఈ పేరుతో వస్తున్న నాని సినిమా ఏ మేరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.

మంగళవారం
పాయల్ రాజ్ పుత్ మెయిన్ లీడ్ గా వస్తుంది మంగళవారం( Mangalavaram ) అనే సినిమా.ఈ సినిమా టీజర్ రిలీజ్ అయి జనాల్లో మంచి ఆసక్తిని కలిగించింది.మంగళవారం రోజు ప్రతిసారి ఎవరో ఒకరు హత్యకు గురవడం వల్ల ఈ చిత్రానికి మంగళవారం అనే పేరు పెట్టుకున్నారు సినిమా మేకర్స్.మరి ఆర్ఎక్స్ 100 బ్యూటీ నటిస్తున్న ఈ సినిమాకి ఏ మాత్రం క్రేజ్ వస్తుందో చూడాలి.

ఆదివారం ఆడవాళ్లకు సెలవు కావాలి
కామెడీ బేస్ చేసుకుని తీసిన ఆదివారం ఆడవాళ్లకు సెలవు( Aadivaram Adavallaku Selavu ) సినిమా సైతం వారం అనే కాన్సెప్ట్ తోనే వచ్చి మంచి విజయాన్ని సాధించింది.

తెల్లారితే గురువారం
కీరవాణి కొడుకు సింహ హీరోగా తెల్లారితే గురువారం( Thellavarithe Guruvaram ) అనే సినిమా గతంలో వచ్చి పరవాలేదు అనిపించుకుంది.

ఏ వెన్స్ డే అనే సినిమా నసీరుద్దీన్ షా ప్రధాన పాత్రలో వచ్చి బాలీవుడ్లో సెన్సేషనల్ క్రియేట్ చేసింది ఇదే సినిమాను ఈనాడు పేరుతో తమిళ్ తో కమల్ హాసన్ నటించగా తెలుగులో డబ్ చేశారు.
ఇది మాత్రమే కాదు శుక్రవారం సోమవారం అనే పేరుతో కూడా గతంలో సినిమాలు వచ్చాయి.మరి ఇక వారాలు పూర్తయ్యాయి కాబట్టి నెలలు మాత్రమే మిగిలి ఉన్నాయి.ఏప్రిల్ 1న విడుదల చిత్రం ఇదివరకే వచ్చిన సంగతి మనకు తెలిసిందే.