సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu ) లేటెస్ట్ గా నటిస్తున్న భారీ మాస్ యాక్షన్ మూవీ ”గుంటూరు కారం”( Guntur Karam ). మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్ లో షూట్ జరుపు కుంటుంది.
ఈ సినిమాకు భారీ హైప్ ఇప్పటికే పెరిగిన విషయం తెలిసిందే.ఎందుకంటే మహేష్, త్రివిక్రమ్( Trivikram ) కాంబో ఇప్పటికే రెండుసార్లు రావడంతో ఇప్పుడు హ్యాట్రిక్ సినిమా విషయంలో ఫ్యాన్స్ ఎన్నో అంచనాలను పెట్టుకున్నారు.
ఇక ఎప్పటికప్పుడు వస్తున్న అప్డేట్స్ తో మరింత హైప్ పెరుగుతూ పోతున్న ఈ సినిమాపై ఇప్పుడు యూఎస్ డిస్టిబ్యూటర్స్ చేసిన పోస్ట్ మరింత హైప్ పెరిగేలా చేసింది.

దసరా కానుకగా యూఎస్ డిస్టిబ్యూటర్స్( Guntur Karam US Distributors ) ప్రత్యంగిరా వారు తాజాగా ఒక చిన్న వీడియో షేర్ చేసారు.అంతేకాదు యూఎస్ లో నెవర్ బిఫోర్ అనేలా రిలీజ్ ఉంటుంది అని ప్రమోషన్స్ తో దద్దరిల్లేలా చేస్తామని చెప్పి ఫ్యాన్స్ లో మరింత ఎగ్జైట్మెంట్ పెరిగేలా చేసారు.మహేష్ కు యూఎస్ మార్కెట్ లో గట్టి పట్టు ఉంది.
ఈయన ప్లాప్ సినిమాలకే ఎక్కడ భారీ కలెక్షన్స్ వస్తాయి.మరి ఈసారి త్రివిక్రమ్ తో కలిసి వస్తున్న గుంటూరు కారం ఘాటు బాగానే వచ్చేలా ఉంది.ఎందుకంటే త్రివిక్రమ్ కు కూడా యూఎస్ లో సపరేట్ మార్కెట్ ఉంది.మరి ఇద్దరు కలిసి వస్తున్న ఈ మూవీ అక్కడ ఎన్ని అంచనాలను పెంచేస్తుందో చూడాలి.

కాగా గుంటూరు మిర్చి యార్డ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను హారిక హాసిని బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.జగపతిబాబు( Jagapathi Babu ) విలన్ గా నటిస్తున్నాడు.ఇక ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్ లుగా నటిస్తున్నారు.థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ కానుంది.







