చర్మం యొక్క రంధ్రాలు తెరుచుకోవడాన్నే ఓపెన్ పోర్స్ అని పిలుస్తారు.స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా ఎంతో మందిని ఇది వేధిస్తుంటుంది.
ఓపెన్ పోర్స్ కారణంగా మొటిమలు, మచ్చలు, బ్లాక్ హెడ్స్, ముడతలు వంటి సమస్యలు వచ్చే రిస్క్ కూడా చాలా ఎక్కువ.అందుకే ఓపెన్ పోర్స్‌ను నివారించుకోవడం కోసం నానా ప్రయత్నాలు చేస్తుంటారు.
అయితే ఇప్పుడు చెప్పబోయే సింపుల్ అండ్ ఎఫెక్టివ్ రెమెడీని ట్రై చేస్తే గనుక ఓపెన్ పోర్స్ పూర్తిగా తొలగిపోవడం ఖాయం.మరి ఇంకెందుకు లేటు ఆ రెమెడీ ఏంటో.? దాన్ని ఎలా తయారు చేసుకోవాలో.? చూసేయండి.
ముందుగా ఒక బంగాళదుంప తీసుకుని పీల్ తొలగించి వాటర్‌లో శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఈ ముక్కలను మిక్సీ జార్‌లో వేసి మెత్తగా పేస్ట్ చేయాలి.
ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో బంగాదుంప పేస్ట్, ఒక చిన్న కప్పు పాలు వేసి స్లో ఫ్లేమ్‌పై స్పూన్‌తో తిప్పుకుంటూ ఉడికించాలి.

పాలు దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి.బంగాళదుంప మిశ్రమాన్ని చల్లారబెట్టుకోవాలి.ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ గోధుమ పిండి, రెండు టేబుల్ స్పూన్ల నిమ్మ రసం వేసి అన్ని కలిసేలా మిక్స్ చేసుకోవాలి.
ఆపై ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఇరవై నిమిషాల పాటు డ్రై అవ్వనివ్వాలి.అనంతరం నార్మల్ వాటర్‌తో ముఖాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.
ఇలా వారంలో రెండు లేదా మూడు సార్లు చేశారంటే ఓపెన్ పోర్స్ పూర్తిగా తగ్గిపోతాయి.అలాగే పైన చెప్పిన రెమెడీని ట్రై చేయడం వల్ల స్కిన్ కలర్ ఇంప్రూవ్ అవుతుంది.
చర్మంపై ఏమైన ముడతలు, సన్నని చారలు ఉంటే తగ్గుముఖం పడతాయి.మరియు ముఖం మునుపటి కంటే ఎక్కువ బ్రైట్‌గా మెరుస్తుంది.