డయాబెటిస్ లేదా చక్కెర వ్యాధి లేదా మధుమేహం ఇలా ఒక్కొక్కరు ఒక్కో పేరుతో పిలిచే ఈ జబ్బు ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మందిని వేధిస్తుంది.కేవలం పాతిక, ముప్పై ఏళ్లకే మధుమేహం వ్యాధి బారిన పడుతున్న వారు నేటి కాలంలో మరింత ఎక్కవైపోయారు.
మారిన జీవినశైలి, ఆహారపు అలవాట్లు కారణంగానే ఎక్కువ మంది డయాబెటిస్ రోగులగా మారుతున్నారు.ఇక డయాబెటిస్ వచ్చిన వారు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
ముఖ్యంగా రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేసే ఆహారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది.
అయితే అలాంటి ఆహారాల్లో దబ్బ పండు ఒకటి.
నిమ్మ జాతికి చెందిన దబ్బ పండు తీపి, పులుపు, వగరు రుచులతో కలిగి ఉంటుంది.ఈ దబ్బ పండుతో చాలా మంది ఊరగాయ పెడతారు.
కొందరు పులిహోర చేసేందుకు కూడా ఉపయోగిస్తారు.దబ్బ పండుతో ఎలా చేసినా.
రుచి అద్భతంగా ఉంటుంది.అయితే కేవలం రుచిలోనే కాదు.
బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు అందించడంలోనూ అద్భుతంగా సహాయపడుతుంది.ముఖ్యంగా డయాబెటిస్ ఉన్న వారు దబ్బ పండు తీసుకోవడం వల్ల.
అందులో పుష్కలంగా ఉండే ఫైబర్ బ్లడ్ షుగర్ లెవల్స్‌ను ఎప్పుడూ అదుపులో ఉండేలా చేస్తాయి.
అయితే మధుమేహం రోగులు దబ్బ పండును ఎలా తీసుకోవాలి అంటే.
జ్యూస్ రూపంలో తీసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.కానీ, షుగర్ లేకుండా తీసుకుంటే మంచిదంటున్నారు.
ఇక దబ్బ పండుతో మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి.దబ్బ పండులో ఉండే విటమన్ సి.
శరీర రోగ నిరోధక శక్తిని బలపరుస్తుంది.అలాగే దబ్బ పండులో ఉండే లైకోపిన్ చర్మాన్ని మృదువుగా ఉండేలా చేస్తుంది.
అదేవిధంగా, దబ్బ పండులో ఉండే విటమిన్ ఎ కంటి చూపును మెరుగుపరుస్తుంది.కాల్షియం మరియు పొటాషియం ఎముకులను, దాంతాలను దృఢపరుస్తుంది.దబ్బ పండులో రక్త హీనతను దూరం చేసే ఐరన్ కూడా ఉంటుంది.ఇక దబ్బ పండు తీసుకోవడం వల్ల గుండె జబ్బులు దూరం అవ్వడంతో పాటు జీర్ణ సమస్యలకు కూడా చెక్ పెట్టవచ్చు.