కుమారి ఆంటీ( Kumari Aunty ) ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు రోడ్డు పక్కన ఫుడ్ స్టాల్ పెట్టుకొని ఎంతోమంది ఆకలి తీర్చుతూ ఆమె కూడా ఫుడ్ బిజినెస్ నడుపుకుంటున్నారు అయితే ఒక్కసారిగా కుమారి ఆంటీ వార్తల్లో నిలిచారు మీది తౌజన్ అయ్యింది రెండు లివర్లు ఎక్స్ట్రా అనే డైలాగుతో ఫేమస్ అయ్యారు.ఇక ఈమె వద్ద తినడానికి ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున రావడంతో ఒక్కసారిగా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తడంతో అధికారులు ఈమె ఫుడ్ స్టాల్ తీసేయించారు.
ఇలాంటి తరుణంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి( Revanth Reddy ) సైతం ఈ ఘటనపై స్పందిస్తూ ఆమెను పోలీసులు ఈమెను ఇబ్బంది పెట్టకూడదంటూ ఆదేశాలను జారీచేశారు.ఇలా ముఖ్యమంత్రి కూడా స్పందించడంతో కుమారి ఆంటీ మరింత ఫేమస్ అయ్యింది.
దీంతో ఈమె ఎన్నో బుల్లితెర కార్యక్రమాలలో కూడా సందడి చేశారు.ఇలా ఒకానొక సమయంలో భారీగా ఫేమస్ అయిన కుమారి ఆంటీ పేరు గత కొద్ది రోజులుగా వినపడలేదు కానీ తాజాగా మరోసారి ఈమె వార్తలు నిలిచారు.

తన ఫుడ్ స్టాల్ తొలగించాలని పోలీసులు చెప్పడంతో ఎంతో ఇబ్బందులు పడిన కుమారి ఆంటీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తిస్థాయిలో మద్దతు తెలిపి ఆమెను ఇబ్బందులకు గురి చేయకూడదని తెలిపారు .దీంతో రేవంత్ రెడ్డిని దేవుడిగా భావించిన కుమారి ఆంటీ ఏకంగా తన పూజ గది( Pooja Room )లో కూడా రేవంత్ రెడ్డి ఫోటో పెట్టుకుని పూజ చేస్తున్నారని చెప్పాలి.తాజాగా ఇందుకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కుమారి ఆంటీ తన ఇంట్లో పూజ చేస్తున్నటువంటి ఒక వీడియోని షేర్ చేయడంతో ఈ వీడియోలో దేవుళ్ళ ఫోటోలతో పాటు రేవంత్ రెడ్డి ఫోటో కూడా ఉంది.ఇక ఈ వీడియో చూసిన నెటిజన్స్ విభిన్న రకాలుగా స్పందిస్తున్నారు.సాయం చేసిన వ్యక్తిని మర్చిపోని కుమారి ఆంటీ నిజమైన అభిమాని అంటూ పొగడ్తలు కురిపించడంతో మరోసారి కుమారి ఆంటీ ట్రెండ్ అవుతున్నారని చెప్పాలి.