టాలీవుడ్ హీరో బాలకృష్ణ( Balakrishna ) హీరోగా నటించిన చిత్రం ఆదిత్య 369.( Aditya 369 ) ఈ సినిమా విడుదల అయ్యి కొన్ని ఏళ్లు పూర్తి అయిన విషయం మనందరికీ తెలిసిందే.34 ఏళ్ల క్రితం ఈ సినిమా విడుదల అయ్యి అప్పట్లోనే భారీ విజయాన్ని అందుకుంది.కలెక్షన్ల సునామీని సృష్టించింది.
ఈ సినిమాలో బాలకృష్ణ మోహిని జంటగా నటించిన విషయం తెలిసిందే.సంగీతం శ్రీనివాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.
ఎస్పీ బాలసుబ్రమణ్యం సమర్పణలో శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా రేపు అనగా ఏప్రిల్ 4వ తేదీన థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది.చాలా కాలం తర్వాత ఈ సినిమా మళ్లీ రీ రిలీజ్ అవుతున్న సందర్భంగా డైరెక్టర్ సింగీతం శ్రీనివాస్( Director Singeetam Srinivas ) మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.34 ఏళ్ల క్రితం విడుదలైన ఆదిత్య 369 సినిమా రీ రిలీజ్( Aditya 369 Re-Release ) కావడం నిజంగా ఒక అద్భుతమైన అనుభూతి.ఈ సినిమాని ఇప్పుడు తీసుంటే బాగుండేది అనిపించిన క్షణాలు ఉన్నాయి.శివలెంక కృష్ణప్రసాద్ ఈ సినిమాను నేటి టెక్నాలజీతో కంప్లీట్‌గా అప్‌గ్రేడ్ చేసి రీ రిలీజ్ చేస్తుంటే ప్రేక్షకులకే కాదు, నాలాంటి వాళ్లకి కూడా సినిమా చూడాలనిపిస్తుంది.
ఇదొక థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ అని శ్రీనివాసరావు తెలిపారు.ఆదిత్య 369 సీక్వెల్ కి( Aditya 369 Sequel ) కూడా కథ సిద్ధం చేశాము.ఈ మూవీ ద్వారా తన కుమారుడు మోక్షజ్ఞని( Mokshagna ) హీరోగా పరిచయం చేయాలనుకున్నారు బాలకృష్ణ.

ఈ మూవీని ప్రకటించినప్పటికీ కుదరల్లేదు.కానీ ఆయన మాత్రం ఎప్పటికైనా సీక్వెల్ చేయాలని అంటుంటారు.అది ఎప్పుడు అవుతుందన్నది దైవ నిర్ణయం.
నేను కాలేజీలో చదువుతున్నప్పుడు హెచ్.జి.వెల్స్ రచించిన ‘ది టైమ్ మిషన్’ నవల ఆధారంగా ఆదిత్య 369 తీశాను.ఈ కథలో లీనమై సంగీతం అందించారు ఇళయరాజా.
పీసీ శ్రీరామ్, వీఎస్‌ఆర్ స్వామి, కబీర్ లాల్ ఇలాముగ్గురు కెమేరామెన్లు పని చేయడం దైవ నిర్ణయం.పేకేటి రంగాగారు శ్రీకృష్ణ దేవరాయలవారి సెట్‌ని, టైమ్ మెషిన్‌ను అద్భుతంగా డిజైన్ చేశారు అని తెలిపారు.