టాలీవుడ్ స్టార్ యాంకర్లలో ఒకరైన ప్రదీప్ కు( Anchor Pradeep ) సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉందనే సంగతి తెలిసిందే.ఈ నెల 11వ తేదీన ప్రదీప్ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి( Akkada Ammayi Ikkada Abbayi ) సినిమా విడుదల కానుంది.
ఈ సినిమా ట్రైలర్ కు ఇప్పటికే ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చిందనే సంగతి తెలిసిందే.అయితే ప్రదీప్ పెళ్లి గురించి సోషల్ మీడియా వేదికగా చాలా సందర్భాల్లో వార్తలు వైరల్ అయ్యాయి.
ప్రదీప్ తన పెళ్లి( Anchor Pradeep Marriage ) వార్తల గురించి రియాక్ట్ అవుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.పెళ్లికి సంబంధించి ఏమీ ప్లాన్ చేయలేదని లైఫ్ లో సెటిల్ కావాలని అనుకున్నానని నాకంటూ కొన్ని డ్రీమ్స్, టార్గెట్స్ ఉన్నాయని ప్రదీప్ వెల్లడించారు.
ముందు వాటిని సాధించాలని నిర్ణయించుకున్నానని ఆయన తెలిపారు.అవి కాస్త ఆలస్యం కావడంతో మిగిలిన విషయాలు కూడా కాస్త టైమ్ పడుతూ వచ్చాయని ప్రదీప్ పేర్కొన్నారు.

నా పెళ్లి గురించి గతంలో ప్రచారంలోకి వచ్చిన వార్తలు నేను కూడా విన్నానని అంతకు ముందు రియల్ ఎస్టేట్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయితో నాకు పెళ్లి అన్నారని ప్రదీప్ పేర్కొన్నారు.త్వరలో క్రికెటర్ తో పెళ్లి అంటారేమో అని ప్రదీప్ వెల్లడించారు.అవన్నీ సరదా ప్రచారాలు మాత్రమేనని ప్రదీప్ వెల్లడించారు.ప్రదీప్ రెమ్యునరేషన్ తీసుకోకుండానే ఈ సినిమాలో నటించారు.

ప్రదీప్ కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉంది.ప్రదీప్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.ప్రదీప్ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉండాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సక్సెస్ సాధిసే ప్రదీప్ కెరీర్ పరంగా మరిన్ని విజయాలను అందుకునే ఛాన్స్ అయితే ఉంది.
ప్రదీప్ టీవీ షోలతో కూడా బిజీ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.