సినిమా ఇండస్ట్రీ లో రకరకాల సెంటిమెంట్ రాజ్యమేలుతాయి.ఒకసారి ప్లాప్ వస్తే వారిని ప్లాప్ హీరోగా లేదా హీరోయిన్ గా ముద్ర వేస్తారు.
ఒక హిట్ వస్తే వరస అవకాశాలు ఇస్తారు .అలాంటి ఈ ఇండస్ట్రీ లో సినిమాలు మొత్తంగా శుక్రవారం రోజే విడుదల అవుతాయి.ఇలా అన్ని సినిమాలు రకరకాల సెంటిమెంట్స్ ని పులుముకొని చివరికి విధులకు నోచుకుంటాయి.టైటిల్ దగ్గర నుంచి విడుదల అయ్యే రోజు వరకు సినిమా గురించి ఎన్నో రకాల మూఢనమ్మకాలు, నమ్మకాలూ ఉండటం అనేది సినిమా పుట్టిన రోజు నుంచే ఉంది.
అయితే అందరు ఇలా సెంటిమెంట్స్ తో ఉంటారా అంటే లేదనే చెప్పాలి.

సినిమా ఇండస్ట్రీ లో కొంత మంది దర్శకులు ఏది వద్దు అంటే అదే చేస్తారు.ఏది సెంటిమెంట్ అంటే అదే బ్రేక్ చేయాలనీ ప్రయత్నం చేస్తారు.అలా వర్మ, కృష్ణ వంశి, తేజ వంటి వారు సెంటిమెంట్ కన్నా కంటెంట్ కె విలువ ఎక్కువ ఇస్తారు.
ఉదాహరణకు డైరెక్టర్ తేజ( Director Teja ) ను తీసుకుంటే అయన చాల ముక్కు సూటి మనిషి.సినిమా తీయాలని అనుకున్నప్పుడు మొదట రామోజీరావు కథ ఒకే చెప్పగానే చివరికి సున్నా రాకుండా ఒక టైటిల్ పెట్టు హిట్ అవుతుంది అని ఎవరో చెప్పారట.
సున్నా( zero ) వస్తే అంత చివరికి సన్నగానే ఉంటుంది అన్నారట.దాంతో సున్నా ఉంటె సినిమా ఎలా హిట్ కాకుండా పోతుందో చూద్దాం అని తన మొదటి సినిమా సున్నా వచ్చేలా చిత్రం అని పెట్టారు.

అది ఎంత పెద్ద విజయం సాధించిందో మన అందరికి తెలిసిందే.ఇక జయం సినిమా( Jayam movie ) కూడా అలాగే సున్నా పెట్టి తీస్తే మంచి విజయాన్ని అందుకుంది.ఇక దర్శకుడిగా కాకుండా నిర్మాతగా కూడా మారి దర్శకుడు తేజ తీసిన చిత్రం నిజం.ఈ సినిమాలో మహేష్ బాబు హీరో గా నటించగా అడుతమైన ప్రాఫిట్స్ ఇచ్చింది అంటూ తేజ ఒక ఇంటర్వ్యూ లో తెలిపారు.
అంతే కాదు హీరో ఉదయ్ కిరణ్( Uday Kiran ) మరియు అనిత హీరోయిన్ గా తేజ దర్శకత్వం లో వచ్చిన సినిమా నువ్వు నేను.ఈ సినిమాలో సున్నా లేదు కానీ నువ్వు మరియు నేను పాదాలకు తాడు వంటి దాన్ని కట్టి సున్నాగా కనిపించాలని పెట్టి విడుదల చేస్తే అది కూడా ఇండస్ట్రీ హిట్ అయ్యింది.