వేసవికాలం రానే వచ్చింది.ఈ సీజన్ లో మండే ఎండలు, అధిక వేడి, ఉక్కపోతను తట్టుకోవడం మరియు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎంత కష్టతరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
అయితే వేసవిలో ఆరోగ్యానికి కొన్ని కొన్ని ఆహారాలు అండగా నిలబడతాయి.ఈ జాబితాలో రాగి జావ(ragi java) కూడా ఒకటి.
వేసవిలో రాగి జావ ఎటువంటి ప్రయోజనాలను అందిస్తుంది? రాగి జావను(ragi java) రోజూ తాగవచ్చా? ఎవరెవరు రాగి జావ తాగకూడదు? అన్న విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
వేసవిలో రోజూ రాగి జావ తాగవచ్చు.
కానీ మితంగా తీసుకోవాలి.రోజుకు ఒక గ్లాస్ వరకు రాగి జావను (ragi java)తాగొచ్చు.
రాగి జావ వేసవి తాపాన్ని తగ్గిస్తుంది.బాడీని హైడ్రేట్ గా ఉంచుతుంది.
రాగి జావ సహజంగానే శరీరాన్ని చల్లబరచే గుణాన్ని కలిగి ఉంటుంది.అందువల్ల నిత్యం ఒక గ్లాస్ రాగి జావ తాగితే వేసవిలో హీట్‌స్ట్రోక్ నుంచి రక్షిణ లభిస్తుంది.

అలాగే ఎండల కారణంగా వేసవిలో చాలా మంతి తరచూ నీరసానికి గురవుతుంటారు.ఏ పని చేయలేకపోతుంటారు.అయితే ఉదయం పూట ఒక గ్లాస్ రాగి జావను తాగితే ఐరన్, కాల్షియం, ఫైబర్ (Iron, calcium, fiber)ఉండటం వల్ల శరీరానికి తగినంత శక్తిని లభిస్తుంది.నీరసం దరిదాపుల్లోకి రాకుండా ఉంటుంది.
రాగి జావ మంచి ఎనర్జీ బూస్టర్ గా పని చేస్తుంది. లో-కేలరీ, హై-ఫైబర్ ఫుడ్ (Low-calorie, high-fiber food)కావడంతో రాగి జావ వెయిట్ లాస్ అవ్వాలని భావిస్తున్న వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
జీర్ణక్రియ ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.

నిత్యం ఒక గ్లాస్ రాగి జావను తీసుకుంటే మలబద్ధకం సమస్య తలెత్తకుండా ఉంటుంది.గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలకు దూరంగా ఉండవచ్చు.అయితే ఆరోగ్యానికి ఎంత మేలు చేసినప్పటికీ రాగి జావను కొందరు ఎవైడ్ చేయాలి.
రాగి జావ శరీరాన్ని చల్లబరచే గుణం కలిగి ఉంటుంది.అందువల్ల సైనస్ సమస్యలు ఉన్నవారు, తరచూ జలుబు మరియు దగ్గుతో బాధపడేవారు రాగి జావను తాగకపోవడమే మంచిది.
రాగిలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది, అంటే ఇది రక్తంలో చక్కెర స్థాయిలను క్రమంగా తగ్గిస్తుంది.ఒకవేళ మీరు తక్కువ బ్లడ్ షుగర్ తో ఇబ్బంది పడుతున్నవారైతే రాగి జావ తాగే ముందు తప్పనిసరిగా వైద్యుల సలహా తీసుకోవాలి.