మానవ జీవితంలో శృంగారం ఎంతో ముఖ్యమైనప్పటికి ప్రస్తుత కాలంలో ఉన్నటువంటి ఒత్తిడులు, ప్రశాంతత లేకపోవడం, సరైన ఆహారపు అలవాట్లు పాటించకపోవడం, వంటి కారణాల వల్ల శృంగారాన్ని పూర్తిగా ఆస్వాదించలేక పోతున్నారు.మామూలుగా మన పెద్దవాళ్ళు మునగకాయలు తింటే శృంగార సామర్థ్యం పెరుగుతుందని అప్పుడప్పుడు చెబుతుంటారు.
అయితే అది వాస్తవమేనని కొందరు వైద్యులు ఇటీవల ప్రయోగాత్మకంగా నిరూపించారు.
మునగకాయలలో విటమిన్లు, ఐరన్, క్యాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయని వీటివల్ల ఎముకలకు ఎంతో మేలు చేకూరుతుందని దాంతో శృంగారంలో ఎక్కువసేపు పాల్గొనే సామర్థ్యం కూడా పెరుగుతుందని తేల్చారు.
అంతేగాక ఐరన్ లోపం ఉన్నవారు కూడా మునగకాయలు ను తరచూ తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుందని, మునగాకు తినడం వల్ల కూడా ఆరోగ్యానికి మేలు చేకూర్చే పోషకాలు అందుతాయని కూడా తెలిపారు.అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి కలుషిత నూనె పదార్థాలు మరియు జంక్ ఫుడ్లు, వంటివి తీసుకోవడం వల్ల శరీరంలో కొవ్వు పెరిగి తొందరగా అలసిపోవడం, బరువు పెరగడం వంటివి జరుగుతాయని కాబట్టి సాధ్యమైనంతవరకు ఆకుకూరలు తినడానికి ప్రయత్నించాలని సూచిస్తున్నారు.
అయితే మునగకాయలు కేవలం శృంగార సామర్థ్యం పెంచడం మాత్రమే కాకుండా పలు గుండె సంబంధిత వ్యాధులు, డయాబెటీస్ వంటి వాటిని కూడా నయం చేసే సామర్థ్యం కలిగి ఉంటుంది.కాబట్టి రోజు లేదా వారంలో రెండు, మూడు సార్లు తప్పనిసరిగా మునగకాయలు తింటే ఫలితాలు ఉంటాయని గతంలో పలుమార్లు ప్రయోగాత్మకంగా నిరూపించారు.