వేసవి కాలం రానే వచ్చింది.భానుడు రోజురోజుకు చుక్కలు చూపిస్తున్నాడు.
దాంతో ప్రజలు ఉదయం 9 గంటలు దాటిందంటే చాలు బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు.అయితే ఈ సీజన్‌లో ప్రధానంగా వేధించే సమస్యల్లో తలనొప్పి ఒకటి.
వేసవి వేడి వల్ల కొందరు తరచూ తలనొప్పికి గురవుతుంటారు.దాంతో ఆ తలనొప్పి బారి నుంచి బయట పడటం కోసం పెయిన్ కిల్లర్స్ వేసుకుంటారు.
ఇలా ప్రతిసారి పెయిన్ కిల్లర్స్ వేసుకోవడం ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు.
కానీ, ఇప్పుడు చెప్పబోయే డ్రింక్‌ను తీసుకుంటే గనుక తలనొప్పిని సహజంగానే నివారించుకోవచ్చు.
అలాగే బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలనూ పొందొచ్చు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ డ్రింక్ ఏంటీ.? దాన్ని ఎలా తయారు చేసుకోవాలి.? వంటి విషయాలపై ఓ లుక్కేసేయండి.ముందుగా ఒక అరటి పండును తీసుకుని పీల్ తొలగించి స్లైసెస్‌గా కట్ చేసుకోవాలి.

ఇప్పుడు బ్లెండర్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న అరటి పండు స్లైసెస్, కొన్ని సెలరీ స్టాక్స్, పది పుదీనా ఆకులు, ఒక కప్పు పెరుగు, రెండు టేబుల్ స్పూన్ల లెమన్ జ్యూస్, మూడు టేబుల్ స్పూన్ల తేనె, హాఫ్ లీటర్ వాటర్ వేసుకోని మెత్తగా గ్రౌండ్ చేసుకుంటే జ్యూస్ సిద్ధం అవుతుంది.ఈ జ్యూస్‌లో రెండు ఐస్ క్యూబ్స్‌ను యాడ్ చేసి తీసుకోవాలి.

ఇలా చేస్తే వేసవి వేడి వల్ల వచ్చిన తలనొప్పి నుంచి క్షణాల్లో ఉపశమనం పొందొచ్చు.కాబట్టి, తలనొప్పి వచ్చినప్పుడు మందులపై ఆధారపడే బదులు ఈ జ్యూస్‌ను తయారు చేసుకుని తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.అలాగే ఈ జ్యూస్‌ను తాగడం వల్ల నీరసం, అలసట వంటి సమస్యలు దూరం అవుతాయి.
డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటారు.వేసవి వేడిని తట్టుకునే శక్తి లభిస్తుంది.
మరియు చర్మం కూడా యవ్వనంగా, కాంతివంతంగా మెరుస్తుంది.