Dandruff : ఎంత ప్రయత్నించినా చుండ్రు పోవడం లేదా.. అయితే ఈ హెయిర్ టోనర్ మీకోసమే!

చుండ్రు( dandruff ) .ఇది చాలా మామూలు సమస్య అయినప్పటికీ ఎంతో అసౌకర్యానికి గురి చేస్తుంది.

 Try This Hair Toner To Get Rid Of Dandruff Quickly-TeluguStop.com

మలాసెజియా గ్లోబోసా ( Malassezia globosa ) అనే ఫంగస్ కారణంగా చుండ్రు ఏర్పడుతుంది.ఈ ఫంగస్ మన తలపై చర్మం, వెంట్రుకల్లో సహజంగా ఉన్న నూనెను పీల్చుకుంటుంది.

చుండ్రు సమస్యకు దారితీస్తుంది.చుండ్రు కారణంగా తలలో తీవ్రమైన దురద, వెంట్రుకలు డ్రై అవ్వడం, హెయిర్ ఫాల్ ఇలా ఎన్నో రకాల సమస్యలు తలెత్తుతుంటాయి.

ఈ క్రమంలోనే చుండ్రును వదిలించుకోవడం కోసం ఖరీదైన షాంపూలను వాడుతుంటారు.

కానీ, ఎంత ప్రయత్నించినా కూడా కొంద‌రిలో చుండ్రు పోదు.

అలాంటి వారికి ఇప్పుడు చెప్పబోయే హెయిర్ టోనర్ గ్రేట్‌గా సహాయపడుతుంది.ఈ హోమ్ మేడ్ టోనర్ చుండ్రును సమర్థవంతంగా వదిలిస్తుంది.

స్కాల్ప్ ను హెల్తీ గా మారుస్తుంది.మరి ఇంతకీ ఆ టోనర్ ను ఎలా తయారు చేసుకోవాలి.? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో రెండు గ్లాసులు వాటర్( Two glasses of water ) పోసుకోవాలి.

వాటర్ కాస్త హీట్ అవ్వగానే అందులో నాలుగు నుంచి ఐదు రెబ్బలు వేపాకు ( Neem )వేసుకోవాలి.

Telugu Dandruff, Tips, Latest, Natural, Riddandruff-Telugu Health

అలాగే కొన్ని వట్టివేర్లు వేసి మూత పెట్టి కనీసం 15 నిమిషాల పాటు ఉడికించాలి.ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని స్ట్రైనర్ సహాయంతో మరిగించిన వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.ఈ వాటర్ గోరువెచ్చగా అయిన తర్వాత నాలుగు చుక్కలు నీమ్ ఎసెన్షియల్ ఆయిల్( Neem essential oil ) వేసుకొని బాగా మిక్స్ చేస్తే మన టోనర్ సిద్ధమవుతుంది.

ఒక స్ప్రే బాటిల్ లో తయారు చేసుకున్న టోనర్ ను నింపుకోవాలి.ఆపై స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి టోనర్ ను ఒకటికి రెండుసార్లు స్ప్రే చేసుకోవాలి.

Telugu Dandruff, Tips, Latest, Natural, Riddandruff-Telugu Health

40 నిమిషాల అనంతరం తేలికపాటి షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.ఈ న్యాచురల్ టోనర్ లో ఉండే పోషకాలు మరియు యాంటీ మైక్రోబియల్ లక్షణాలు వివిధ ఫంగ‌ల్ ఇన్ఫెక్షన్స్ ను నివారిస్తాయి.చుండ్రు సమస్యను చాలా వేగంగా అరికడతాయి.వారానికి ఒక్కసారి ఈ హెయిర్ టాన‌ర్ ను వాడారంటే చుండ్రు అన్న మాట అనరు.పైగా ఈ టోనర్ స్కాల్ప్‌ లో రక్త ప్రసరణ పెంచుతుంది.దీంతో మీ జుట్టు మూలాల నుంచి ఆరోగ్యంగా మరియు బలంగా మారుతుంది.

నిర్జీవమైన జుట్టును పునరుద్ధరించడానికి కూడా ఈ టోనర్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది.కాబట్టి తప్పక ట్రై చేయండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube