MLC Kavitha : జీవో నంబర్-3 ను ఉపసంహరించుకోవాలి..: ఎమ్మెల్సీ కవిత

తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత( BRS MLC Kavitha ) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.అణగారిన వర్గాల ఆడబిడ్డలకు రేవంత్ రెడ్డి( Revanth Reddy ) ప్రభుత్వం అన్యాయం చేస్తోందన్నారు.

 Go Number 3 Should Be Withdrawn Mlc Kavitha-TeluguStop.com

గ్రూప్ -1 నోటిఫికేషన్ లో రోస్టర్ పాయింట్లు లేని హారిజంటల్ పద్ధతిలో రిజర్వేషన్లు అమలు చేస్తున్నట్లు ఉందని తెలిపారు.అయితే దీని వలన బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలు ఉద్యోగ అవకాశాలు కోల్పోయే ప్రమాదం ఉందని ఆమె ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో రోస్టర్ పాయింట్లు లేకుండా మహిళలకు 33.3 శాతం రిజర్వేషన్లు కల్పించగలరా అని ప్రశ్నించారు.546 గ్రూప్ -1 పోస్టుల్లో మహిళలకు ఎన్ని పోస్టులు కేటాయించారో చెప్పాలన్న కవిత జీవో నంబర్-3 ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube