MLC Kavitha : జీవో నంబర్-3 ను ఉపసంహరించుకోవాలి..: ఎమ్మెల్సీ కవిత

తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత( BRS MLC Kavitha ) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

అణగారిన వర్గాల ఆడబిడ్డలకు రేవంత్ రెడ్డి( Revanth Reddy ) ప్రభుత్వం అన్యాయం చేస్తోందన్నారు.

గ్రూప్ -1 నోటిఫికేషన్ లో రోస్టర్ పాయింట్లు లేని హారిజంటల్ పద్ధతిలో రిజర్వేషన్లు అమలు చేస్తున్నట్లు ఉందని తెలిపారు.

అయితే దీని వలన బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలు ఉద్యోగ అవకాశాలు కోల్పోయే ప్రమాదం ఉందని ఆమె ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో రోస్టర్ పాయింట్లు లేకుండా మహిళలకు 33.3 శాతం రిజర్వేషన్లు కల్పించగలరా అని ప్రశ్నించారు.

546 గ్రూప్ -1 పోస్టుల్లో మహిళలకు ఎన్ని పోస్టులు కేటాయించారో చెప్పాలన్న కవిత జీవో నంబర్-3 ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.