అమెరికాలో షూటింగ్ జరుపుకున్న తొలి తెలుగు సినిమా ఏంటో తెలుసా?

తెలుగు సినిమా పరిశ్రమలో సరికొత్త ప్రయోగాలు చేశాడు సూపర్ స్టార్ కృష్ణ‌.ఏ హీరోకు సాధ్యం కాని సాహసాలు చేశాడు ఆయన.

పలు జానర్ సినిమాలతో పాటు ఆనేక ఫార్మాట్లకు ఆయన సినిమాలే బేస్ మార్క్ గా నిలిచాయి.అంతేకాదు.

అప్పటి వరకు భారతదేశానికి మాత్రమే పరిమితం అయిన తెలుగు సినిమా షూటింగ్ ను తొలిసారి అమెరికాకు తీసుకెళ్లిన నటుడు ఆయన.అమెరికాలో షూటింగ్ జరుపుకున్న తొలి తెలుగు సినిమా కృష్ణ‌దే కావడం విశేషం.ఇంతకీ ఆ సినిమా విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం.1980లో కృష్ణ‌ హీరోగా హ‌రేకృష్ణ హ‌లోరాధ తీస్తున్నారు.ఆ సినిమా ఒకపాట, కొన్ని సీన్లు మినహా 90 శాతం షూటింగ్ పూర్తయ్యింది.

శ్రీ ప్రియ నటీమణిగా చేసింది.ఈ సినిమాకు శ్రీధర్ దర్శకత్వం వహించారు.

Advertisement

ఈ సినిమాలోని మిగిలిన బాగాలను అమెరికాలో చిత్రీకరించడానికి ప్రత్యేకంగా కథలను మార్చారు.తెలుగుతో పాటు తమిళ భాషల్లో ఒకేసారి ఈ సినిమాను చిత్రీకరించారు.

లాస్ ఏంజెల్స్‌, శాంతామోనికా బీచ్‌, శాండియాగో బీచ్‌, లాస్ వేగాస్‌, ఫీనిక్స్ సహా పలు ప్రాంతాల్లో సీన్లు, పాటలు షూట్ చేశారు.క్లైమాక్స్ గ్రాండ్ కాన్య‌న్‌లో చిత్రీకరించారు.

అనంతరం గుర్రాల ఆట చిత్రీకరణ కోసం ఫీనిక్స్ లో షూటింగ్ కొనసాగించారు.ఆ ఆటను చూస్తూ, ఎవరూ లొంగదీయలేని గుర్రాన్ని హీరో లొంగదీసే సీన్లకు అక్కడ చిత్రీకరించారు.అద్భుతంగా వచ్చిన ఈ సీన్లన్నీ జనాలను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

అటు డైరెక్ట‌ర్ శ్రీ‌ధ‌ర్‌.ఆదుర్తి సుబ్బారావు తేనె మ‌న‌సులు సినిమాతో కృష్ణ‌ను హీరోగా ప‌రిచ‌యం చేశాడు.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

కానీ అంతకంటే ముందే ఓ త‌మిళ సినిమాతో కృష్ణ‌ను హీరోగా ఇంట్రడ్యూస్ చేయాలనుకున్నాడు.కానీ అది సాధ్యం కాలేదు.

Advertisement

ఆ సినిమా తర్వాత 15 సంవత్సరాల తర్వాత హ‌రేకృష్ణ హ‌లోరాధ సినిమాతో కృష్ణ‌ను హీరోగా పరిచయం చేశాడు.మొత్తంగా ఈ సినిమాతో ఆయన సక్సెస్ కొట్టాడు.

తాజా వార్తలు