సౌత్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో సీనియర్ నటి రాధిక శరత్ కుమార్(Radhika Sarath Kumar) ఒకరు.ఈమె భారతీయ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన కిఝక్కే పోగుమ్ రైల్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు.
ఇక అనంతరం కథ ప్రాధాన్యత ఉన్న సినిమాలలో నటిస్తూ 80 లలో బిజీ హీరోయిన్గా ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగారు.తమిళ భాషలో మాత్రమే కాకుండా తెలుగులో కూడా అగ్ర హీరోలందరి సరసన నటించే అవకాశాలను అందుకుంటు రాధిక శరత్ కుమార్ మంచి సక్సెస్ అందుకున్నారు.

ఇలా సినిమా ఇండస్ట్రీలో మంచి పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్న ఈమె రాజకీయాలలో కూడా ప్రవేశించారు.ఇక ప్రస్తుతం రాధిక తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి వరుస సినిమాలలో సపోర్టింగ్ పాత్రలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.ఇక ఈమె యాంకర్ గాను అలాగే బుల్లితెర సీరియల్స్ లో కూడా నటించి బుల్లితెర ప్రేక్షకులను కూడా మెప్పించారు.ఇలా కెరియర్ పరంగా ఫుల్ బిజీగా ఉన్న రాధికా శరత్ కుమార్ కి ఇటీవల ఒక సర్జరీ జరిగిందని తెలుస్తుంది.
అయితే ఈ విషయాన్ని ఈమె మహిళా దినోత్సవం సందర్భంగా బయటపెట్టారు.

హాస్పిటల్లో సర్జరీ చేయించుకున్నటువంటి కొన్ని ఫోటోలను ఈమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.ఇక ఈ ఫోటోలలో తన భర్త శరత్ కుమార్ (Sarath Kumar)కూడా ఉన్నారు.ఈ ఫోటోలను షేర్ చేసిన రాధిక నేను నా గురించి లేదా నా పని గురించి ఎప్పుడూ మాట్లాడను.
గత రెండు నెలలు నిజంగా కఠినంగా గడిచాయి.నా రెండు సినిమాల సెట్‌లో ఉన్నప్పుడు, నా మోకాలికి గాయమైంది అంటూ ఈమె తన సర్జరీ (Surgery)గురించి కాస్త ఎమోషనల్ అవుతూ ఈ పోస్ట్ చేశారు.
ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారడంతో రాధిక త్వరగా కోలుకోవాలని ఆమె క్షేమంగా ఉండాలి అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.








