పిఠాపురం( Pitapuram ) ఎమ్మెల్యే గారి తాలూకా ఈ టైటిల్ ఎంతలా ఫేమస్ అయిందో మనకు తెలిసిందే.గత ఏడాది మార్చి నుంచి కూడా ఈ టైటిల్స్ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే వస్తోంది.
గత ఎన్నికలలో పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ఎప్పుడైతే పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారో అప్పటినుంచి పిఠాపురం నియోజకవర్గానికి చెందిన వారందరూ కూడా పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అంటూ స్టిక్కర్స్ బైక్ అలాగే కార్లపై వేసుకొని తిరుగుతూ కనిపించారు.
ఎన్నికలలో ఎలాగైనా పవన్ గెలుస్తారనే ధీమా వ్యక్తం చేశారో అలాగే పవన్ కూడా 70 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
అయితే పవన్ కళ్యాణ్ కోసం అభిమానులు క్రియేట్ చేసిన ఈ టైటిల్ పై ఒక యంగ్ హీరో మనసు పడ్డారని తెలుస్తుంది.ఈ క్రమంలోనే తన సినిమాకు కూడా ఇదే తరహా టైటిల్ పెట్టుకోబోతున్నట్టు సమాచారం.
మరి పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అంటూ రాబోతున్న ఆ హీరో ఎవరు ఏంటి అనే విషయానికి వస్తే.

రామ్ పోతినేని ( Ram Pothineni )ప్రస్తుతం పలు సినిమా పనులలో బిజీగా ఉన్నారు.ఈయన చివరిగా డబల్ ఇస్మార్ట్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు కానీ ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.ఈ క్రమంలోనే ప్రస్తుతం రామ్ పీ మహేష్ బాబు ( P.Mahesh Babu )దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు.ఒక వీరాభిమాని తన అభిమాన హీరోని కలుసుకునే క్రమంలో దారి మధ్యన జరిగే ప్రయాణం ని ఆధారంగా తీసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారని తెలుస్తుంది.
ఈ సినిమాల్లో రామ్ మరి యంగ్ లుక్ లో కనిపించబోతున్నారు ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఎన్నో పోస్టర్స్ విడుదల చేశారు.

ఇక ఈ సినిమాకు ఆంధ్ర కింగ్ గారి తాలూకా (Andhra King Gari Thakuka)అంటూ టైటిల్ ఖరారు చేశారని తెలుస్తుంది అయితే ఈ టైటిల్ను పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా టైటిల్ ఆధారంగా చేసుకుని ఫిక్స్ చేశారని తెలుస్తోంది.అయితే ఈ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.పవన్ కళ్యాణ్ కోసం మేము క్రియేట్ చేసిన టైటిల్ ఆధారంగా రామ్ లాంటి హీరో తన సినిమాకు అలాంటి టైటిల్ పెట్టుకోవడం నిజంగా గ్రేట్ అంటూ పవన్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.







