టాలీవుడ్ ఇండస్ట్రీలో ( Tollywood industry )మంచి గుర్తింపును సొంతం చేసుకున్న హీరోయిన్లలో కీర్తి సురేష్ ( Keerthy Suresh )ఒకరు.కీర్తి సురేష్ రెమ్యునరేషన్ ఒకింత భారీ స్థాయిలో ఉందనే సంగతి తెలిసిందే.
వరుస ప్రాజెక్ట్ లతో కీర్తి సురేష్ బిజీగా ఉండగా తన సినిమాలకు సంబంధించిన విశేషాలను ఆమె పంచుకున్నారు.దోశ అంటే నాకు చాలా ఇష్టమని కీర్తి సురేష్ పేర్కొన్నారు.
చిన్నప్పుడు రూపాయి నాణేలను నోట్లో పెట్టుకోవడం అలవాటుగా ఉందని ఆమె తెలిపారు.అలా రెండుసార్లు కాయిన్లను మింగేశానని ఆ అలవాటు మానేయడానికి చాలా సమయం పట్టిందని ఆమె చెప్పుకొచ్చారు.
చిన్నప్పుడు ఇంట్లో ఎవరైనా తిడితే వాళ్లు రెస్ట్ రూమ్ కు వెళ్లిన సమయంలో గడియ పెట్టేదానినని కీర్తి సురేష్ పేర్కొన్నారు.ఈ విధంగా అమ్మను చాలాసార్లు ఏడిపించానని ఇప్పటికీ కోపం వస్తే అలానే చేస్తానని ఆమె పేర్కొన్నారు.

కీర్తి సురేష్ సినిమా ప్రయాణంలో ఎన్నో ఒడిదొడుకులు ఏర్పడ్డాయి.ఆమె నటించిన ఎన్నో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు( Lady oriented movies ) బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచాయి.కీర్తి సురేష్ పెళ్లి తర్వాత కెరీర్ ను ఏ విధంగా ప్లాన్ చేసుకుంటారో చూడాల్సి ఉంది.కీర్తి సురేష్ తెలుగు ప్రాజెక్ట్ లతో రీఎంట్రీ ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
కీర్తి సురేశ్ కెరీర్ లో హిట్స్ కంటే ఫ్లాప్స్ ఎక్కువగా ఉన్నాయి.

సెకండ్ ఇన్నింగ్స్ అయినా కీర్తి సురేష్ కు కలిసొస్తుందేమో చూడాల్సి ఉంది.మహానటి సినిమాలో( Mahanati movie ) నటించడానికి భయం వేసిందని ఆమె అన్నారు.కల్కి సినిమాలో కారుకు కీర్తి సురేష్ వాయిస్ ఓవర్ అందించగా ఆ వాయిస్ సినిమాకు ప్లస్ అయింది.
త్వరలో కీర్తి సురేష్ భవిష్యత్తు ప్రాజెక్ట్స్ గురించి పూర్తిస్థాయిలో క్లారిటీ వచ్చే ఛాన్స్ అయితే ఉంది.కీర్తి సురేష్ కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉంది.