టాలీవుడ్ ఇండస్ట్రీలో నిధి అగర్వాల్( Nidhi Agarwal ) ప్రస్తుతం మరీ అంత బిజీగా లేకపోయినా ఆమె చేతిలో క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయనే సంగతి తెలిసిందే.ఈ ఏడాది నిధి అగర్వాల్ హరిహర వీరమల్లు( Hari Hara Veeramallu ) సినిమాతో పాటు ది రాజాసాబ్( The Rajasaab ) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
ఈ సినిమాల విశేషాల గురించి నిధి అగర్వాల్ షాకింగ్ విషయాలను వెల్లడించగా ఆ విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.
ది రాజాసాబ్ సినిమాలో నేను దెయ్యం పాత్రలో( Ghost Role ) కనిపిస్తానని వైరల్ అయిన వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని ఆమె చెప్పుకొచ్చారు.
ది రాజాసాబ్ సినిమాలో నా పాత్ర అందరినీ ఆశ్చర్యానికి గురి చేసేలా ఉంటుందని నిధి అగర్వాల్ అభిప్రాయం వ్యక్తం చేశారు.ప్రభాస్( Prabhas ) ఎప్పుడూ నవ్విస్తూ ఉంటారని సెట్ లో అందరితో సరదాగా ఉంటారని నిధి అగర్వాల్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

నిధి అగర్వాల్ హరిహర వీరమల్లు మూవీ గురించి మాట్లాడుతూ హరిహర వీరమల్లు మూవీ కోసం 75 రోజుల పాటు గుర్రపు స్వారీ నేర్చుకున్నానని తెలిపారు.భరతనాట్యం, కథక్ లో కూడా నేను శిక్షణ తీసుకున్నానని ఆమె చెప్పుకొచ్చారు.పవన్ తో( Pawan Kalyan ) కలిసి నటించడం మరిచిపోలేని అనుభవం అని నిధి అగర్వాల్ వెల్లడించారు.పవన్ గొప్ప మేధావి అని పవన్ కు సాహిత్యంపై పట్టు ఉందని ఆమె పేర్కొన్నారు.

పవన్ కళ్యాణ్ ధైర్యాన్ని అభినందించాలని పవన్ డిప్యూటీ సీఎం కాకముందే హరిహర వీరమల్లు షూట్ మొదలైందని నిధి అగర్వాల్ పేర్కొన్నారు.పవన్ అప్పటికీ ఇప్పటికీ అలానే ఉన్నారని కొంచెం కూడా మార్పు లేదని నిధి అగర్వాల్ వెల్లడించరు.నిధి అగర్వాల్ చెప్పిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.







