టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన మహేష్ బాబుకు( Mahesh Babu ) ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉంది.మహేష్ రాజమౌళి( Rajamouli ) కాంబో మూవీ షూట్ ఇప్పటికే మొదలైందంటూ కొన్ని ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
షూట్ మొదలైన కొన్ని రోజులకే ఇలా జరగడం ఏంటని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా అభిప్రాయం వ్యక్తం చేశారు.అయితే ఇందుకు సంబంధించి షాకింగ్ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది.
మహేష్ జక్కన్న కాంబో మూవీ షూట్ మొదలైనట్టు వైరల్ అవుతున్న వార్తల్లో నిజం లేదట.ప్రస్తుతం జరుగుతున్న షూట్ టెస్ట్ షూట్ మాత్రమేనని సమాచారం అందుతోంది.మొత్తం 3 వారాల పాటు ఈ టెస్ట్ షూట్ జరగనుందని భోగట్టా.రాజమౌళి మహేష్ బాబుతో తెరకెక్కిస్తున్న తొలి సినిమా కావడంతో మహేష్ బలాలను గుర్తించడానికి జక్కన్న ఈ టెస్ట్ షూట్( Test Shoot ) ప్లాన్ చేశారని సమాచారం.

మహేష్ రాజమౌళి కాంబో సినిమాకు( Mahesh Rajamouli Movie ) సంబంధించి త్వరలో అధికారికంగా అప్ డేట్స్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి.మహేష్ జక్కన్న కాంబో మూవీ బడ్జెట్ ఏకంగా 1000 కోట్ల రూపాయలు అనే సంగతి తెలిసిందే.మహేష్ రాజమౌళి కాంబో మూవీ ఇతర భాషల్లో సైతం అంచనాలను మించి హిట్టయ్యే ఛాన్స్ ఉంది.ఈ మూవీ డిజిటల్ హక్కులు నెట్ ఫ్లిక్స్ సొంతమయ్యాయి.

మహేష్ జక్కన్న బాక్సాఫీస్ వద్ద మరిన్ని రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తారు.మహేష్ బాబు ఈ సినిమాలో సరికొత్త లుక్ లో కనిపించనున్నారని తెలుస్తోంది.మహేష్ బాబు ఈ సినిమా కోసం 100 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకుంటున్నారు.జక్కన్న గతంలో ఏ సినిమాకు కేటాయించనంత సమయం ఈ సినిమాకు కేటాయిస్తున్నారు.
ఈ సినిమా కోసం జక్కన్న దాదాపుగా ఆరు సంవత్సరాలు వర్క్ చేశారని చెప్పవచ్చు.







